Young Heroes: సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత కష్టపడి సినిమాలు చేసినా కూడా ఒక్కోసారి సక్సెసులనేవి దక్కవు. కారణం ఏదైనా కూడా ఫెల్యూయర్స్ ను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… ఇక ఒక్కోసారి పెద్దగా కష్టపడకుండా చేసిన సినిమాలు సైతం సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటాయి… సీనియర్ నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి రెండు వరుస సక్సెస్ లను సాధించి నటుడిగా తన సత్తాను చాటుకున్నాడు.
ఇక ఆ తర్వాత వరుసగా మంచి విజయాలను సాధిస్తాడు అనుకున్నప్పటికి ఇప్పటివరకు వరుసగా 22 ఫ్లాపులు అయితే చవిచూసాడు. ఇక తనకు హిట్టు దక్కదు అని అందరూ అనుకున్నప్పుడు శంభాల సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. 2025 డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఆ సంవత్సరం చివరి సక్సెస్ లో ఒకటిగా నిలిచింది…
15 సంవత్సరాల తర్వాత దక్కిన సక్సెస్ గా ఆది ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు… ఇక నందు లాంటి యంగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి తను సోలో హీరోగా చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించలేదు. తనతో పాటు నటించిన నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోలందరూ స్టార్ హీరోలుగా మారుతుంటే అతను మాత్రం ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
చివరి ప్రయత్నం గా ‘సైక్ సిద్ధార్థ్’ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా జనవరి ఒకటోవ తేదీన రిలీజ్ అయింది. మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకొని డీసెంట్ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక నందు సైతం సోలో హీరోగా మరికొన్ని సినిమాలను చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ ఇద్దరు హీరోలు వచ్చిన సక్సెస్ లను జాగ్రత్తగా కాపాడుకుంటూ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించే సినిమాలను చేస్తే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు…