Chiranjeevi Bobby Movie Story: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సంపాదించి పెట్టడమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అతని అభిమానులుగా మార్చి వేశాయి. మాస్ సినిమాలను చేయడంలో అతన్ని మించిన వారు మరెవరు లేరు అనేది వాస్తవం… ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన తొందరలోనే మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులు అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన మార్చి నెల నుంచి బాబి డైరెక్షన్లో చేయబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి – బాబీ కాంబినేషన్లో ఇంతకుముందే ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాబీ దీన్ని పూర్తి కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక సినిమా స్టోరీ ఏంటి అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది హిట్ ఫార్ములా అనే చెప్పాలి.
ప్రతి ఒక్కరు ఆ ఫార్మాట్లో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన వారే కావడం విశేషం… మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ‘హిట్లర్’ సినిమా సైతం సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాని చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తన సిస్టర్ కి ఇబ్బంది రావడంతో చిరంజీవి ఎలాంటి డిసిజన్ తీసుకున్నాడు. సిస్టర్ ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరు ఎందుకని అలా చేస్తున్నారు అనే పాయింట్ మీదనే ఈ సినిమా చాలా ఎక్సైటింగ్ గా సాగబోతుందట… చూడాలి మరి బాబీ ఈ సినిమాతో చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడు అనేది…