https://oktelugu.com/

Akhil: అఖిల్ మేకోవర్ లుక్ చూస్తే షాక్​.. ఏజెంట్​ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో!

Akhil: టాలీవుడ్ యంగ్​ హీరో అక్కినేని వారసుడు అఖిల్​ ఎప్పటి నుంచో మంచి సాలిడ్ హిట్​ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​తో మంచి టాక్ తెచ్చుకున్నారు. ఈ ఉత్సాహంతోనే తన తర్వాత మూవీ కోసం భారీగా కష్టపడుతున్నారు. సురేందర్​రెడ్డి దర్శకత్వంలో అఖిల్​ తన తర్వాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఏజెంట్​ అనే టైటిల్​ను పెట్టారు. దీంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 / 12:34 PM IST
    Follow us on

    Akhil: టాలీవుడ్ యంగ్​ హీరో అక్కినేని వారసుడు అఖిల్​ ఎప్పటి నుంచో మంచి సాలిడ్ హిట్​ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​తో మంచి టాక్ తెచ్చుకున్నారు. ఈ ఉత్సాహంతోనే తన తర్వాత మూవీ కోసం భారీగా కష్టపడుతున్నారు. సురేందర్​రెడ్డి దర్శకత్వంలో అఖిల్​ తన తర్వాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    స్పై థ్రిల్లర్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఏజెంట్​ అనే టైటిల్​ను పెట్టారు. దీంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ కూడా శరవేగంగా సాగుతోంది. ఇందులో అఖిల్ గూఢచారిగా కనిపించనున్నారు. దానికి తగ్గట్లుగానే అఖిల్ తన లుక్​ను మార్చుకుంటున్నారు. తాజాగా, అఖిల్ కొత్త మేకోవర్ అందర్నీ ఆకర్శించింది.

    ఈ ఫొటోలో కండలు తిరిగిన దేహంతో చాలా దృఢంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తదుపరి షెడ్యూల్​లోకి అడుగుపెట్టనుంది.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం కొచ్చిలో షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్​లో యాక్షన్​ సీక్వెన్స్​ చిత్రీకరించనున్నారు.  ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. ఇందులో అఖిల్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య  నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.