Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. అఖిల్ కి ఆ పిచ్చి బాగా పట్టుకుంది

ప్చ్.. అఖిల్ కి ఆ పిచ్చి బాగా పట్టుకుంది

అక్కినేని పోరగాడు అఖిల్ కి షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ లాంటివి చూపించడం కాస్త కొత్త. కాకపోతే, తెలుగు హీరోలకు ఇది ఎప్పటి నుండో వస్తోన్న ఆనవాయితీ. అయితే, బాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల కిందటే ఈ షర్టు విప్పుడు సిక్స్ ప్యాక్ గట్రా చూపించుడు లాంటి పోగ్రామ్స్ పరమ రొటీన్ వ్యవహారం. తెలుగులో గత కొన్నేళ్లుగానే ఈ బాగోతాలు సాగుతున్నాయి. దాంతో ఒక్కొక్క హీరో తమ సిక్స్ ఫ్యాక్ లను ప్రదర్శించడానికి తెగ ఉత్సాహ పడిండ్రు. […]

most eligible bachelorఅక్కినేని పోరగాడు అఖిల్ కి షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ లాంటివి చూపించడం కాస్త కొత్త. కాకపోతే, తెలుగు హీరోలకు ఇది ఎప్పటి నుండో వస్తోన్న ఆనవాయితీ. అయితే, బాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల కిందటే ఈ షర్టు విప్పుడు సిక్స్ ప్యాక్ గట్రా చూపించుడు లాంటి పోగ్రామ్స్ పరమ రొటీన్ వ్యవహారం. తెలుగులో గత కొన్నేళ్లుగానే ఈ బాగోతాలు సాగుతున్నాయి.

దాంతో ఒక్కొక్క హీరో తమ సిక్స్ ఫ్యాక్ లను ప్రదర్శించడానికి తెగ ఉత్సాహ పడిండ్రు. ఊరికే సిక్స్ ప్యాక్ చూపిస్తే బాగోదు కదా.. అందుకే ఏదో ఫైటింగ్ సీన్ ఎట్టేసుకోవడం, ఆ ఫైట్ గట్రాలో ఏ రౌడీనో పుసుక్కున హీరోగారి చొక్కా లాగడం ఆ విధంగా సిక్స్ ప్యాక్ ప్రేక్షకులకు దర్శనం ఇచ్చుకోవడం లాంటి చెత్త ఫైట్లు మనం ఇప్పటికే ఎన్నో ఫక్తు తెలుగు కమర్షియల్ సినిమాల్లో చూసి చూసి విసిగి వేసారిపోయినాము.

ఎంత విసిగినామో అనేది సగటు ప్రేక్షకుడిగా ఇది మనకు మాత్రమే తెలుసు. ఇక అసలు తతంగంలోకి వెళ్తే.. అక్కినేని అఖిల్ ఇప్పుడు ఇదే సిక్స్ ప్యాక్ వ్యవహారంలోకి తొంగి చూడటానికి కాస్త సిగ్గు పడుతూనే మొత్తానికి లాంగ్ టైం తన సిక్స్ ప్యాక్ ని చూపించబోతుండు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి అఖిల్ చేస్తుండు కదా.

ఆ సినిమాలోనే అఖిల్ ఐదు నిమిషాల ఫైట్ లో షర్టు విప్పేసి రౌడీల బెండ్ వంచే క్రమంలో తన సిక్స్ ప్యాక్ ను కాస్త గట్టిగా చూపిస్తాడట. అయినా ఆ మధ్య వచ్చిన తన కొత్త సినిమా పోస్టర్ లో కూడా తనలోని సిక్స్ ప్యాక్ ను చూపించాడు అఖిల్. అనిల్ సుంకర నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో నలభై కోట్ల భారీ బడ్జెట్ తో చేస్తోన్న సినిమాలో కూడా అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి షర్ట్ లెస్ సిక్స్ ప్యాక్ పోస్టర్ బాగానే వైరల్ అయింది. మొత్తానికి అక్కినేని కుర్ర హీరోకి సిక్స్ ప్యాక్ పిచ్చి పట్టుకుంటుంది అన్నమాట. ప్రతి సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాలని తెగ ఉబలాట పడుతుండు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper