https://oktelugu.com/

Bala Krishna: నందమూరి అభిమానులకు స్వీట్ న్యూస్… ఒకే వేదిక పైకి బాల‌కృష్ణ, ఎన్టీఆర్‌…

Bala Krishna: స్టార్ హీరోలను ఒక వేదికపై చూస్తే అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పాలి. అదే నందమూరి నట సింహా లైనా బాలయ్య, తారక్ ను ఒకే వేదిక మీద చూస్తే ప్రేక్షకులకు కనువిందే అని చెప్పాలి. అయితే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సంధర్బంగా ప్రమోషన్స్ ని ప్రారంభించడానికి మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. మాస్ మూవీస్ తెరకెక్కించడంలో బోయపాటి శ్రీనుకు ఎవరూ సాటి లేరు అనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 08:21 PM IST
    Follow us on

    Bala Krishna: స్టార్ హీరోలను ఒక వేదికపై చూస్తే అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పాలి. అదే నందమూరి నట సింహా లైనా బాలయ్య, తారక్ ను ఒకే వేదిక మీద చూస్తే ప్రేక్షకులకు కనువిందే అని చెప్పాలి. అయితే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సంధర్బంగా ప్రమోషన్స్ ని ప్రారంభించడానికి మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. మాస్ మూవీస్ తెరకెక్కించడంలో బోయపాటి శ్రీనుకు ఎవరూ సాటి లేరు అనే చెప్పాలి. గతంలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వరగాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.  ప్రముఖ హీరో శ్రీకంఠ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండడం మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ మూవీని డిసెంబర్ 2 న ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షక అభిమానులలో అంచనాలు పెంచేశాయి.

    ఈ నెల 27న ఫ్రీ రిలిజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోలు ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నానిని  కూడా ఆహ్వానించారట చిత్ర బృందం. అయితే ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ నాని కూడా తమ అంగీకారం తెలిపారు అంట దీంతో ఒకే వేదికపై బాబాయ్ కొడుకు కలిసి అభిమానులను అలరించే బోతున్నారు. ఈ వార్తతో  నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.