Vijay Devarakonda: ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా… డైరెక్టర్ ఎవరంటే ?
Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. కష్టపడి స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆ తర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం […]
Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. కష్టపడి స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆ తర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లింది టీమ్. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెడతారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనే విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ‘నిన్ను కోరి’ ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన డైరెక్ట్ చేసిన ‘టక్ జగదీష్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విజయ్ తో సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు సమాచారం.
అమెరికాకు వెళ్లడానికి ముందు విజయ్ కి శివ నిర్వాణ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాడంట. విజయ్ దేవరకొండకు అది నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.