Akhanda 2 vs OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి విజయాలను సాధించాలనే దృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు (Hariahara Veeramallu) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో చేస్తున్న ఓజీ (OG) సినిమాని సైతం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఈ సినిమాకు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో ఆయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని కూడా చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్య బాబు (Balayya Babu)హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.
Also Read: OG : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఇదేనా..?
మరి ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి భారీగా నష్టం వాటిల్లబోతుంది అనేదాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఓజీ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి అలాగే పాన్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో చాలామంది జనాలకు తెలుసు, ఇక సాహో సినిమాతో సుజీత్ కూడా బాలీవుడ్ కి బాగా పరిచయం అయ్యాడు.
కాబట్టి అతని సినిమాకు ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే లేవు. ఇక బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా రొటీన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం. అలాగే బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్స్ రియల్టీకి దగ్గరగా ఉండకపోవడం వల్ల ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read: OG : Akhanda 2 Release Date: అఖండ 2′ విడుదల తేదీ వాయిదా..? నందమూరి అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్!
అయితే బాలయ్య బాబు సినిమాలను ఇష్టపడే వాళ్ళు మాత్రం వీటికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మేనియాతో పోలిస్తే బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ కొంత వరకు తక్కువనే చెప్పాలి. కాబట్టి ఈ రెండు సినిమాలు పోటీకి వస్తే అఖండ 2 సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…