Helping friends: అరె మామ అర్జెంటుగా ఒక 5000 ఫోన్ పే చెయ్.. నేను మళ్ళీ వన్ వీక్ లో ఇచ్చేస్తాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అర్జంట్.. ప్లీజ్ అర్థం చేసుకోరా..
పాపం స్నేహితుడు ఏ కష్టాల్లో ఉన్నాడో.. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో.. ఎంతటి అవసరమొస్తే నాకు ఫోన్ చేసి ఉంటాడు.. ఏదైతే అది అయింది.. ముందుగా వాడిని కష్టాలనుంచి బయట పడేద్దాం. ఇబ్బందుల నుంచి బయటకు లాగుదాం.. వాటి సమస్యను పరిష్కరిద్దాం అనుకొని.. ముందు వెనుక ఆలోచించకుండా 5000 ఫోన్ పే చేసేస్తాం. ఆ తర్వాత ఆ డబ్బులు అడిగితే.. అతడు మాట దాటివేస్తాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. అనంతరం బ్లాక్ లో పెడతాడు.. తీరా ఇంటికి వెళ్లి అడిగితే దుబాయిస్తాడు. గట్టిగా అడిగితే ఎదురుదాడికి దిగుతాడు.. ఈ తరహా పరిణామాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అవసరానికి డబ్బులు అడగడం.. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఎగ్గొట్టడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా స్నేహితుల మధ్య ఇలాంటి వ్యవహారాలు రివాజుగా మారిపోయాయి. వాస్తవానికి అత్యవసర పరిస్థితుల్లో స్నేహితులు మాత్రమే అప్పు ఇస్తారు. కానీ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల కాలంలో ప్యూబిటీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితుడి వద్ద అవసరానికి డబ్బులు తీసుకొని.. తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేవారు పెరిగిపోయారని తెలుస్తోంది. ఇలాంటివారు ఏకంగా 73 శాతం మంది ఉన్నారని ప్యూబిటీ సర్వేలో తేలింది. కేవలం 27 శాతం మంది మాత్రమే తమ స్నేహితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తున్నారని ఆ సర్వేలో తేలింది.. అయితే ఇలాంటి సమస్యలు స్నేహాన్ని దెబ్బతీస్తున్నాయని.. స్నేహితుడి మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆ సర్వేలో వెళ్లడైంది.
Read Also: ఈ ఫోటో అత్యంత అరుదైనది..కోటి లో ఒక షాట్ ఇలా వస్తుందట! దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
” అవసరానికి డబ్బు తీసుకోవడం తప్పుకాదు. ముఖ్యంగా స్నేహితుడికి చెప్పుకొని డబ్బులు తీసుకోవడం నేరం కాదు. కాకపోతే తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించడంలో చాలామంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అవసరానికి డబ్బులు తీసుకొని ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు స్నేహితుల మధ్య విభేదాలు పెరిగేలా చేస్తున్నాయి. వారి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. ఇలా గొడవలు పడి చాలామంది విడిపోతున్నారు. అంతేకాదు పరస్పరం దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాలలో చాలామంది స్నేహితులు ఇన్వాల్వ్ కావడం లేదు. స్నేహితుడు ఎంత కష్టాల్లో ఉన్నా సరే డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాంటి పరిణామాలను చవిచూసిన తర్వాత చాలామంది స్నేహం మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. అయితే ఇలాంటి పరిణామాలకు చెక్ పెట్టి.. స్నేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని” ప్యూబిటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో చాలామంది తమ స్నేహితుల ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది.