Aus Vs SA WTC Final Steve Smith: డబ్ల్యూటీసీ తుది పోరు భారీ అంచనాల మధ్య మొదలైంది. క్రికెట్ మక్కా లార్డ్స్ లో గురువారం ప్రోటీస్, కంగారు జట్ల మధ్య గద కోసం పోరు మొదలైంది.. టాస్ గెలిచిన ప్రోటీస్ జట్టు సారధి రబాడ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదని ప్రోటీస్ జట్టు బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా కగిసో, జాన్సన్ నిప్పులు చెరిగే బంతులు వేశారు. ఎన్నో అంచనాలున్న ఖవాజా (0) ను డక్ అవుట్ గా రబాడా వెనక్కి పంపించాడు. ఈ దశలో లబూ షేన్(17) కాస్త ప్రతిఘటించినప్పటికీ.. అతను జాన్సన్ కు దొరికిపోయాడు. గ్రీన్(4) ను రబాడా దొరకబుచ్చుకున్నాడు. ఎన్నో అంచనాలు ఉన్న హెడ్ (11) జాన్సన్ చేతిలో బలయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా 67 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్ కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఇక ఈ దశలో స్మిత్ (67) ఆస్ట్రేలియాను కాస్త బయటపడేసే ప్రయత్నం చేశాడు. అయితే మరో బ్యాటర్ నుంచి అతనికి సపోర్ట్ లభించకపోవడంతో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే సెంచరీ దిశగా వెళ్తున్న అతడిని మార్క్రం వెనక్కి పంపించాడు. జాన్సన్ పట్టిన క్యాచ్ తో స్మిత్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.
లార్డ్స్ మైదానంలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా స్మిత్ వరి కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక వైపు వికెట్లు వెంటవెంటనే పడుతున్నప్పటికీ.. స్మిత్ మాత్రం గట్టిగా నిలబడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఫారిన్ ప్లేయర్ గా అతడు రికార్డు సృష్టించాడు.. కాదు తన సొంత జట్టుకు చెందిన లెజెండ్రీ ఆటగాడు వారెన్ బర్డీస్లీ చేసిన 575 పరుగుల రికార్డును అధిగమించాడు. లార్డ్స్ మైదానంలో 8 ఇన్నింగ్స్ లలో 551 పరుగులు చేసిన బ్రాడ్మన్ రికార్డును కూడా స్మిత్ బద్దలు కొట్టాడు. స్మిత్ ఈ మైదానంపై మూడు అర్థ సెంచరీలు, రెండు సెంచరీలు చేశాడు. 2015లో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో 215 పరుగుల హైయెస్ట్ స్కోర్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో స్మిత్ ఐదో వికెట్ కు ఆల్రౌండర్ బ్యూ వెబ్ స్టర్ తో కలిసి 50 పరుగులు జోడించాడు. జట్టును సురక్షితమైన స్థానంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే శతకం చేస్తాడు అనుకుంటున్న సమయంలో 66 పరుగులు చేసిన స్మిత్ మార్క్రం బౌలింగ్లో పెవిలియన్ చేరుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా 10 ఫోర్ల దాకా ఉన్నాయి.
లార్డ్స్ లో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్లు వీళ్లే
స్టివ్ స్మిత్(ఆస్ట్రేలియా) ఇతడు 10 ఇన్నింగ్స్ లలో 588* రన్స్ చేశాడు.
వారెన్(ఆస్ట్రేలియా) ఏడు ఇన్నింగ్స్ లలో 575 పరుగులు చేశాడు.
సోబర్స్ (వెస్టిండీస్) 9 ఇన్నింగ్స్ లలో 571 రన్స్ చేశాడు.
బ్రాడ్ మన్(ఆస్ట్రేలియా) ఎనిమిది ఇన్నింగ్స్ లలో 551 పరుగులు చేశాడు.
చందర్ పాల్(వెస్టిండీస్) 9 ఇన్నింగ్స్ లలో 512 రన్స్ చేశాడు
MARKRAM GETS SMITH.
– A great catch from Jansen. pic.twitter.com/9OsmL8aoRX
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2025