Akhanda 2 Postponed: ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘అఖండ 2′(Akhanda 2 Movie). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాల్గవ చిత్రమిది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం పై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ సినిమా కచ్చితంగా దసరా కానుకగా విడుదల అయ్యి ఉండేది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో మేకర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 కి వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు కానీ, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడు, రికార్డ్స్ బద్దలు కొడతాడని బలమైన నమ్మకం పెట్టుకున్నారు.
అంతే కాకుండా ఈ చిత్రం నుండి విడుదలైన రెండు టీజర్స్ కి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై మరింత హైప్ పెంచడానికి కారణం అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం డిసెంబర్ 5 న విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. అందుకు కారణం రాజా సాబ్ వాయిదా పడింది అనే వార్త బలంగా వినిపిస్తుంది కాబట్టి. జనవరి 9న ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం విడుదల చేస్తున్నామని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కానీ గత రెండు రోజుల నుండి ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 6000 VFX షాట్స్ విదేశాల నుండి డెలివరీ అవ్వాల్సిన అవసరం ఉందట.
సమయం తక్కువ ఉండడం, డైరెక్టర్ వైపు నుండి కరెక్షన్స్ ఎక్కువ రావడం తో, ఈ సినిమా అనుకున్న తేదికి రావడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ జనవరి 9న రాజా సాబ్ విడుదల కాకుంటే, ఆ స్థానం లోకి అఖండ 2 వస్తుందని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సంక్రాంతికి వేస్తేనే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదల అవ్వబోతోంది. చిరంజీవి, బాలయ్య సినిమాల మధ్య పోటీ అంటే ఏ రేంజ్ కిక్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంక్రాంతికి కోళ్లపందాలు ఎంత ఫేమసో, చిరంజీవి, బాలకృష్ణ సినిమాల పోటీ కూడా అంతే ఫేమస్. వీళ్లిద్దరి మధ్య జరిగిన క్లాష్ లో బాలయ్య రెండు సార్లు చిరంజీవి పైన విజయం సాధిస్తే, 12 సార్లు మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించాడు. మరి ఈసారైనా బాలయ్య చిరంజీవి పై లీడ్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.