Divvala Madhuri: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ దివ్వెల మాధురి. సోషల్ మీడియా లో ఈమెపై మొదటి నుండి నెగిటివిటీ తారాస్థాయిలో ఉండేది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎంతో కొంత పాజిటివిటీ ని సంపాదించుకొని బయటకు వచ్చింది. ఇక్కడ కూడా ఆమె నోరు జారడం వల్లే జనాలు ఆమెకు ఓట్లు వేయడం మానేశారు కానీ,చివరి మూడు రోజుల్లో మాత్రం తనూజ తో మంచిగా ఉండడం, తానూ ఎలిమినేట్ అయిపోతాను అనే విషయం అర్థమయ్యాక కూడా తన కోసం సేవింగ్ పవర్ ని ఉపయోగించొద్దు అని చెప్పడం, ఇవన్నీ ఆమెకు కాస్త పాజిటివ్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫైర్ వాతావరణం మీద జరిగింది. జాఫర్ అడిగే ప్రశ్నలకు దివ్వెల మాధురి ఒక రేంజ్ లో రెచ్చిపోతూ సమాదానాలు చెప్పింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎక్కువ శాతం ప్రశాంతంగా సమాదానాలు ఇచ్చేందుకే ప్రయత్నం చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో జాఫర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు,భరణి గారు కలిసి డ్యాన్స్ వేసినప్పుడు సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వచ్చాయి. కానీ అలా ట్రోల్స్ వేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇచ్చారు కదా?’ అని అడుగుతాడు. దానికి మాధురి సమాధానం చెప్తూ ‘ఆ మీమ్స్ చేసినవాడు కచ్చితంగా ఒక్క అమ్మా అబ్బకి అయితే పుట్టలేదు. అక్కడ నాగార్జున సార్ దీపావళి ఎపిసోడ్ లో టాస్క్ లో భాగంగా డ్యాన్స్ వెయ్యమంటే మేము వేసాము, అక్కడ మేము ఏమైనా రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ వేశామా?, ఒకరిని ఒకరు హగ్గులు చేసుకున్నామా?, మీమ్స్ చేసే వాళ్లకు, అడిగే మీకు బుద్ధి ఉండాలి’ అని అంటుంది.
నేను ఏ రోజు కూడా భరణి తో క్లోజ్ గా మాట్లాడింది లేదు, ఆయన పక్కన కూర్చున్నది లేదు, అందరితో మాట్లాడినట్టే అతనికి కూడా మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది. మీరు భరణి కి అనేక సందర్భాల్లో సపోర్టు చేశారు కదా? అని అడిగిన ప్రశ్నకు మాధురి సమాధానం చెప్తూ ‘ఎప్పుడు సపోర్టు చేశాను చెప్పు?, ఆయన వల్లే బిర్యానీ సమయం లో పెద్ద రచ్చ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది మాధురి. దువ్వాడ శ్రీనివాస్ కూడా సోషల్ మీడియా లో భరణి, మాధురి ని లింక్ చేస్తూ చేసిన మీమ్స్ గురించి మాట్లాడుతూ ‘మాధురి ఎలాంటి అమ్మాయి అనేది నాకు తెలుసు, నేను ఎలాంటి వాడిని అనేది మాధురి కి తెలుసు, బయట ఎవరెన్ని అనుకుంటే నాకేంటి, వెదవలు నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఫైర్ ఫైర్ మీద సాగిన ఈ పూర్తి ఇంటర్వ్యూ ని మీరు కూడా చూసేయండి.
