Akhanda 2 Pre Release Business: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ లేనటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక అందులో బాలయ్య బాబు ఒకరు. ప్రస్తుతం సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ఆయన ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ పనులను చూసుకునే క్రమంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక అఖండ 2 సినిమా రిలీజ్ కి ముందే 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది… దాంతో ఇప్పుడు సినిమా యూనిట్ తో పాటుగా బాలయ్య బాబు అభిమానుల్లో కూడా భారీగా ఆనందమైతే వ్యక్తమవుతోంది.
Also Read: హిందీలో కూడా ‘వార్ 2’ ని డామినేట్ చేస్తున్న ‘కూలీ’..ఈరోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే!
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చేస్తున్న ఈ సినిమాతో విజయాన్ని సాధిస్తే వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు. అలాగే సీనియర్ హీరోలు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను కూడా సంపాదించుకున్న వాడవుతాడు. మరి ఇలాంటి సందర్భంలోనే భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కూడా ఈ సినిమాకి కలిసివచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఓటిటి రైట్స్ ని హాట్ స్టార్ వాళ్ళు 100 కోట్లకు కొనుగోలు చేశారు, శాటిలైట్ రైట్స్ సైతం 60 కోట్లకు అమ్ముడుపోయాయి…ఇక మ్యూజిక్ రైట్స్ 8 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం…ఇక దీంతో సినిమా రిలీజ్ కి ముందే 168 కోట్ల బిజినెస్ జరుపుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య బాబు కెరియర్ లోనే ఇది అత్యంత పెద్ద బిజినెస్ డీల్ అని చెప్పుకోవచ్చు.
Also Read: ‘స్టాలిన్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ప్రింట్ ఖర్చులు కూడా రాలేదుగా!
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ రిలీజ్ తర్వాత బిజినెస్ ని జరుపుకుంటే అఖండ 2 మాత్రం రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను జరుపుకొని ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా మీద ఉన్న హైప్ వల్లే ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకొందని తెలుస్తోంది… పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…