Agnipariksha Reality Show: టెలివిజన్ రంగంలోనే అత్యంత భారీ షో గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ షో చాలా మంచి పాపులారిటిని సంపాదించుకుంది…ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ షో గా ఎదిగింది. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 9వ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి ఇలాంటి క్రమంలోనే సామాన్యులను ఇందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్నిపరీక్ష పేరుతో ఒక షోని కండక్ట్ చేస్తున్నారు. అందులో ఎవరైతే మంచి గుర్తింపును సంపాదించుకుంటారో వాళ్లను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 అయితే నిన్న టెలికాస్ట్ అయింది. ఇందులో కొంతమందికి మాత్రమే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి జడ్జెస్ అవకాశాలను ఇస్తున్నారు. ఇక మిగతా వాళ్ళని మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు.
Also Read: జడ్జీలకు ‘అగ్ని పరీక్ష’ పెట్టిన దమ్ము శ్రీజ..టార్చర్ చూపించేసిందిగా!
ఎందుకంటే ఇంతకుముందు మూడు టాస్క్ లలో ఎవరైతే చాలా చక్కటి పర్ఫామెన్స్ ని అందించారో వాళ్లలో కొంతవరకు మ్యాటర్ ఉందని జడ్జెస్ అనుకున్నారో వాళ్లకి మాత్రమే నాలుగో రౌండ్లో వాళ్ల ప్రతిభను చూపించుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ ని అందిస్తున్నారు. మిగిలిన వాళ్లకు మాత్రం కల్పించడం లేదు. కారణం ఏంటి అంటే వాళ్లు మూడు రౌండ్లో కూడా జడ్జెస్ ను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ షో కి పనికిరారనే ఉద్దేశ్యంతో వాళ్ళని ఇన్ డైరెక్టుగా హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ విషయం తెలియని కొంతమంది ప్రేక్షకులు మాత్రం కావాలనే జడ్జెస్ కొంతమందికి కంటెస్టెంట్స్ కి షార్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక మరికొంతమందిని షో నుంచి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ల మీద నెగెటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఇక్కడ ఎవరు ఎవరి కోసం ఏమీ చేయరని వాళ్ళను వాళ్లే ప్రూవ్ చేసుకుంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరుకుతుందనేది వాస్తవం…
Also Read: బిడ్డకు జన్మని ఇవ్వడం గొప్ప కాదట..ఇలాంటి మనుషులు కూడా ఉంటారా!
ఇక ఎవరైతే బిగ్ బాస్ షో లోకి వెళ్లి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి మేము పంపిస్తున్నాము అంటూ జడ్జెస్ క్లారిటీ తో ఉన్నారు… మరి ఏది ఏమైనా కూడా అగ్ని పరీక్షలో పాల్గొంటున్న 45 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ ఐదుగురు ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి…