Narayanaswamy SIT: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో తమకు నష్టం చేసిన చాలా అంశాలను ఆ పార్టీ విస్మరిస్తోంది. అందులో అమరావతిపై విష ప్రచారం ఆపడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఆ పార్టీలో మంచి పేరు ఉన్న నేతల అక్రమాల మూలాలు సైతం బయటపడుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసును మూలాలకు వెళ్లి మరి శోధన చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. కసిరెడ్డి తో మొదలైన అరెస్టులు.. నేడు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కూతవేటు దూరంలో నిలిచాయి. గతంలో నారాయణస్వామిని విచారణకు పిలిచారు సిట్ అధికారులు. కానీ అనారోగ్య కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో సిట్ అధికారులు నేరుగా నారాయణస్వామి ఇంటికి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. ఏ క్షణం అయినా ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది.
Also Read: జగన్ కు కేంద్రం షాక్
* చంద్రబాబుపై అనుచిత కామెంట్స్..
చంద్రబాబు ( CM Chandrababu)జిల్లాకు చెందిన వారు నారాయణస్వామి. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారాయణస్వామి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. చివరకు జైలులో ఉన్న చంద్రబాబుకు ఆయన కుటుంబం పంపిన ఆహారం మీద కూడా వెటకారం ఆడారు. ఎన్నెన్నో విమర్శలు చేశారు. అయితే అది ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైశాచికత్వం అది. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న నారాయణస్వామి ఎక్సైజ్ శాఖను చూసేవారు. ఆయనకు తెలియకుండానే అప్పట్లో మద్యం పాలసీలో నిర్ణయాలు జరిగాయని ఇప్పటివరకు అంతా భావించారు. ఆయన విషయంలో కూటమి ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని కూడా అంతా అనుకున్నారు. కానీ నాటి నారాయణస్వామి మాటలు, వెటకారాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
* దూకుడు నేతలంతా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు చూస్తుంటే.. వారి అవినీతితో పాటు దూకుడు కూడా ఒక కారణం. ఒకరా.. ఇద్దరా.. పదుల సంఖ్యలో వైసీపీ నేతలు జైలు పాలయ్యారు. నందిగామ సురేష్( nandigama Suresh), వర్ర రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్, జోగి రాజీవ్, పిన్నెల్లి బ్రదర్స్, పోసాని కృష్ణ మురళి, కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణిక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి,మిధున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. వీరంతా ఇప్పటివరకు అరెస్టు అయిన వారే. ఇప్పుడు ఆ జాబితాలో నారాయణ స్వామి సైతం చేరనున్నారని ప్రచారం నడుస్తోంది.
* త్వరలో వారందరూ..
అమరావతి పై( Amravati capital ) విషం చిమ్మడం ఒకవైపు ఆగడం లేదు. మరోవైపు వైసీపీ నేతల అరెస్టుల పర్వం కూడా ఆగడం లేదు. ప్రధానంగా అవినీతి చిట్టాలో భాగంగా ఆడుదాం ఆంధ్రాలో రోజా, కొడాలి నాని.. రేషన్ పంచాయితీలో పేర్ని నాని.. బెదిరింపుల ముడుపుల విషయంలో విడదల రజిని, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, సజ్జల భార్గవ్, ఆళ్ల రామకృష్ణ, రామ్ గోపాల్ వర్మ.. ఇలా వీరంతా అరెస్టు జాబితాలో ఉన్నారు. చివరకు బిగ్ బాస్ పేరు కూడా వినిపిస్తోంది.