Akhanda 2 Overseas Advance Bookings: నందమూరి(Nandamuri Balakrishna) అభిమానులు ప్రస్తుతం ‘అఖండ 2′(Akhanda 2 Movie) కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లో ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్న ఎన్టీఆర్ నుండి ఇప్పట్లో ఎలాంటి సినిమాలు వచ్చే పరిస్థితి లేకపోవడం తో వాళ్ళు కూడా ఈ చిత్రం కోసమే ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం ఇప్పటి వరకు స్టార్ హీరోలకు మాత్రమే జరిగింది. కానీ మొట్టమొదటిసారి సీనియర్ హీరో బాలయ్య కి మళ్లీ ఆ రేంజ్ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ సినిమాని 4.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. కానీ వసూళ్లు మాత్రం అందులో పావు శాతం కూడా వచ్చేలా కనిపించడం లేదు.
ఎందుకంటే రీసెంట్ గానే నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. USA లో టాప్ చైన్స్ గా పిలవబడే సినీ మార్క్ చైన్స్ లో 330 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేశారు. ఏ తెలుగు సినిమాకు అయినా 60 శాతం వసూళ్లు ఇక్కడి నుండే వస్తాయి. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే డల్లాస్ లాంటి ప్రాంతాల్లో కూడా టాప్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. లెక్కప్రకారం ఈ పాటికి కనీసం లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకు కనీసం 30 వేల డాలర్లు కూడా రాలేదు. కేవలం 27 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ చిత్రం ‘ఓజీ’ ప్రీమియర్ రికార్డుని బద్దలు కోరుతామని సవాళ్లు విసిరారు. ఓజీ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇది ఆల్ టైం రికార్డు కి చాలా దగ్గర. ‘అఖండ 2’ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి రావాలి. కానీ ట్రెండ్ చూస్తే ఫుల్ రన్ లో అయినా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. మొదటి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, రెండవ టీజర్ కి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అసలు రెండవ టీజర్ వచ్చింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. త్వరలోనే ఈ సినిమా నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ వస్తోంది. కనీసం ఇక్కడి నుండి అయినా ఈ చిత్రం ఆడియన్స్ లో ఊపు తీసుకొస్తుందో లేదో చూడాలి. ఈ ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ అయితే కచ్చితంగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.