Kerala local body elections: కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 13న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గ్రామ పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ సహా అన్నింటికి ఒకే సారి నిర్వహించబోతున్నాయి. ఎందుకంత ప్రాధాన్యత అంటే..కేరళలో స్థానిక సంస్థలు అత్యంత కీ పవర్స్ గా ఉన్నాయి. అక్కడ దేశానికే మొత్తం రోల్ మోడల్ గా కేరళ పంచాయితీ వ్యవస్థ ఉంది. అక్కడ అధికారాలు ఎక్కువ. క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. పవర్ హౌస్ గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జరుగబోతుండడంతో ఈ తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది తేలనుంది.
కేరళలో గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగబోతున్న ఈ పోరు, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ కూటములైన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) లకు కీలకమైన శక్తిపరీక్ష కానుంది.
పోలింగ్ తేదీలు చూస్తే డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కేరళలో స్థానిక సంస్థలు దేశంలోనే అత్యంత శక్తివంతమైనవిగా, వికేంద్రీకరణకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఎన్నికల తీర్పు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడిని, పార్టీల బలాబలాలను అంచనా వేయడానికి ముఖ్య సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకం.. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా, అన్ని పార్టీలకు అగ్ని పరీక్షే. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు
