Akhanda 2 OTT Release Date: ప్రస్తుతం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ జుట్టు అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video), నెట్ ఫ్లిక్స్(Netflix) చేతుల్లో ఉంది అనే విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎంతటి క్రేజ్ ఉన్న సినిమా అయినా కానీ, ఎంత భారీ బడ్జెట్ పెట్టి తీసినా కానీ, విడుదల తేదీని కేవలం ఈ రెండు ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రం, అదే విధంగా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘కింగ్డమ్’ చిత్రాలను ఓటీటీ సంస్థలు ఎంత ఇబ్బంది పెట్టాయో మన కళ్లారా చూసాము. ఇప్పుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి కూడా అదే చూడబోతున్నాము. ఈ సినిమాని మేకర్స్ సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వడం అసాధ్యమని, డిసెంబర్ కి వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి వినిపిస్తున్న వార్త.
Also Read: కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన ‘కూలీ’ మేకర్స్..ఇంత దారుణమా?
కానీ మేకర్స్ మాత్రం మేము అసలు వెనక్కి తగ్గడం లేదు, సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది, గ్రాఫిక్స్ వర్క్ కూడా అనుకున్న సమయానికే డెలివరీ అవుతుంది, ఎట్టిపరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 న వస్తున్నాము అంటూ రీసెంట్ గానే బోయపాటి శ్రీను కూడా అంభిమానులతో చెప్పుకొచ్చాడు. కానీ అదే తేదీన పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం ‘ఓజీ’ కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, యావత్తు సినీ లోకం ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఆ తేదీన విడుదల చేస్తే అఖండ 2 ని ఎవ్వరూ పట్టించుకోరని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మాట వినిపిస్తున్నా కూడా మేకర్స్ వెనక్కి తగ్గడం లేదు. కానీ మేకర్స్ ఉత్సాహానికి అమెజాన్ ప్రైమ్ వీడియో అడ్డుకట్ట వేస్తుంది.
Also Read: ‘పుష్ప 2’ వల్ల ఫహాద్ ఫాజిల్ ఇంత కోల్పోయాడా? సంచలనం రేపుతున్న కామెంట్స్!
ఈ సంస్థ ‘అఖండ 2’ నిర్మాతలకు మంచి ఫ్యాన్సీ ప్రైజ్ ఆఫర్ చేసింది. ఆ ప్రైజ్ కి ఈ చిత్రాన్ని అమ్మడానికి మేకర్స్ కూడా సిద్దమే. కానీ వాళ్ళు సెప్టెంబర్ తేదీన విడుదల చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ‘కాంతారా 2’ స్లాట్ ఇప్పటికే బుక్ అయిపోయింది. ఆ నెల మరో చిత్రాన్ని విడుదల చేయడం కష్టం. అందుకే సెప్టెంబర్ నెలలో విడుదలకు అమెజాన్ సంస్థ ఒప్పుకోవడం లేదు. అమెజాన్ ఒప్పుకోకపోతే ఇక నెట్ ఫ్లిక్స్ కి వెళ్ళాలి. నెట్ ఫ్లిక్స్ సంస్థ సెప్టెంబర్ నెలకు ఓజీ కి స్లాట్ కేటాయించింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడితే తప్ప, ‘అఖండ 2’ ని కొనుగోలు చేసే అవకాశమే లేదు. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో ఎటు చూసినా ప్రాక్టికల్ గా విడుదల అవ్వడం అసాధ్యం. డిసెంబర్ నెలకు వాయిదా పడే అవకాశం ఉంది.