HHVM Box Office Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండి కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా సెకండ్ హాఫ్ లోని కొన్ని పేలవంతమైన VFX సన్నివేశాలను సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ దురాభిమానుల అదేపనిగా పెట్టుకొని సినిమా పై తీవ్రమైన నెగిటివ్ టాక్ ని పెంచాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ స్టామినా కి అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరి నిమిషం వరకు నిర్మాత కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో బయ్యర్స్ ని ఖరారు చేసుకోలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలకు వచ్చే హైర్స్ ఈ చిత్రానికి రాలేదు. కేవలం రెండు కోట్ల రూపాయిల హైర్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు.
Also Read: అమెజాన్ ప్రైమ్’ మరియు ‘నెట్ ఫ్లిక్స్’ మధ్య నలిగిపోతున్న ‘అఖండ 2’
‘సలార్’, ‘కల్కి’ రేంజ్ ఓపెనింగ్ అనుకోవచ్చు. అయితే సోషల్ మీడియా నుండి ఘోరమైన నెగటివ్ టాక్ రావడం తో ఆ ప్రభావం కాస్త సినిమా మీద రెండవ రోజు బలంగా పని చేసింది. మొదటి రోజు 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు కేవలం 3 కోట్ల 50 లక్షలకు పరిమితమైంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి మూడవ రోజు నుండి శ్రీరామ రక్షగా మారారు. రెండవ రోజు వచ్చిన డ్రాప్స్ ని చూసి కనీసం ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అయినా రాబడుతుందా అని అనుకున్న అభిమానులకు, కేవలం మొదటి లాంగ్ వీకెండ్ లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి దగ్గరగా వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన ‘కూలీ’ మేకర్స్..ఇంత దారుణమా?
ఈ రేంజ్ నెగిటివ్ టాక్ వేరే ఏ హీరో కి వచ్చినా ఆ సినిమా నిలబడదని, కేవలం పవన్ కళ్యాణ్ అవ్వడం వల్లే ఈ మాత్రం వసూళ్లు అయినా వచ్చాయని అంటున్నారు. 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉంటూ పాతబడిన ప్రాజెక్ట్ గా పిలవబడిన ఈ చిత్రానికే ఇంతటి గ్రాండ్ ఓపెనింగ్ దక్కితే, ఇంకో రెండు నెలల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న ‘ఓజీ’ చిత్రం విడుదలైతే ఎంత ఎలాంటి రికార్డ్స్ వస్తాయో ఊహించడానికి కూడా కష్టమే అని సోషల్ మీడియా లో అభిరామానులు కామెంట్స్ చేస్తున్నారు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుంది. సోమవారం రోజున ఫస్ట్ షోస్ నుండి ప్రధాన నగరాల్లో మంచి ఆక్యుపెన్సీలను రాబట్టిన ఈ చిత్రం, నేడు నాగుల చవితి అవ్వడంతో ఇంకా మంచి వసూళ్లను రాబడుతుంది.