Homeఎంటర్టైన్మెంట్Latest OTT premieres: ఈ వారం ఓటీటీ లోకి 'కుబేర' తో పాటు రాబోతున్న సినిమాలు...

Latest OTT premieres: ఈ వారం ఓటీటీ లోకి ‘కుబేర’ తో పాటు రాబోతున్న సినిమాలు ఇవే!

Latest OTT premieres:ప్రతీ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సూపర్ హిట్ సినిమాలను ఇంట్లో బిజీ గా ఉండడం వల్లనో, లేదా ఆఫీస్ లో సెలవు ఇవ్వకపోవడం వల్లనో మనం థియేటర్స్ లో మిస్ అవుతూ ఉంటాము. అలా మిస్ అయిన సినిమాలను ఓటీటీ లో చూద్దామనే ఆలోచనతో ఉంటారు. అలాంటి ఆడియన్స్ కి ఈ వీకెండ్ పండగే అని అనుకోవచ్చు. ఈ వీకెండ్ ఓటీటీ లో విడుదల అవ్వబోతున్న సినిమాలేంటో ఒకసారి వివరంగా చూద్దాము.

Also Read: బాలీవుడ్ లో చిరంజీవిని అవమానించింది ఎవరు? పాన్ ఇండియాలో జెండా ఎగురవేస్తాడా..?

కుబేర(Kuberaa Movie):

శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 20 న భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది. ఈ చిత్రాన్ని ఈ నెల 18 న అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

భైరవం(Bhairavam Movie):

మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) కలిసి నటించిన ఈ మల్టీ స్టార్రర్ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ,కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ కచ్చితంగా చూడాల్సిన సినిమానే. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగులోనే బాగా తీశారు. ఈ సినిమా ఈ నెల 18 న జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.

భూతిని(Bhootini Movie):

నాగిని ఫేమ్ మౌని రాయ్(Mouni Roy),సంజయ్ దత్(Sanjay Dutt) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ చిత్రం కూడా జీ 5 యాప్ లోనే ఈ నెల 18 న విడుదల కాబోతుంది. మంచి టైం పాస్ ని అందించే హారర్ థ్రిల్లర్ జానర్. చూసి ఎంజాయ్ చేయండి.

Also Read: రజినీకాంత్ చివరి చిత్రం అదేనా..?అతని డ్రీమ్ మూవీ కోసం అడుగులు వేస్తున్నాడా..?

వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో ది ఫ్రాగ్రంట్ పవర్ సీజన్ 1 తో పాటు పలు ఇంగ్లీష్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఆసక్తి ఉంటే చూడండి, ఇవి పెద్ద పాపులర్ సినిమాలు కావు. ఇక హాట్ స్టార్ యాప్ లో ‘ది స్టార్ ట్రెక్ సీజన్ 3’ అనే వెబ్ సిరీస్, స్పెషల్ GPS సీజన్ 2 వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. గత సీజన్స్ కి ఇందులో మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడాలనుకుంటే మొదటి సీజన్ నుండి చూసి ఎంజాయ్ చేయండి . ఈ సిరీస్ లు కూడా ఈ నెల 18 న విడుదల కాబోతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular