https://oktelugu.com/

Akhanda 2: ‘అఖండ 2’ ఇక లేనట్టేనా.. బాలయ్య ఫ్యాన్స్ కి చేదువార్త!

ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.ఈ చిత్రానికి ముందు 30 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని బాలయ్య, తన తదుపరి చిత్రానికి ఏకంగా మొదటి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగాడు. ఇక నుండి ఆయన చెయ్యబొయ్యే సినిమాలకు కూడా అదే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 25, 2023 / 07:06 PM IST

    Akhanda 2

    Follow us on

    Akhanda 2: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అఖండ’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ క్లోజ్ అయిపోతున్న సమయానికి బాలయ్య బాబు కి సరికొత్త సినీ జీవితాన్ని ఇచ్చింది ఈ చిత్రం. అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రం 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

    ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.ఈ చిత్రానికి ముందు 30 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని బాలయ్య, తన తదుపరి చిత్రానికి ఏకంగా మొదటి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగాడు. ఇక నుండి ఆయన చెయ్యబొయ్యే సినిమాలకు కూడా అదే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి.

    బాలయ్య కి అలాంటి మార్కెట్ ఇచ్చిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ గా ‘అఖండ 2 ‘ వస్తుందని బోయపాటి శ్రీను ప్రకటించడం తో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ‘అఖండ 2 ‘ చిత్రాన్ని తీసే ఆలోచనని తాత్కాలికంగా బోయపాటి శ్రీను పక్కన పెట్టునట్టు తెలుస్తుంది. ఆ చిత్రానికి బదులు గా ‘లెజెండ్ 2 ‘ కథని సిద్ధం చెయ్యాల్సిందిగా కోరాడట బాలయ్య బాబు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, తెలుగు దేశం పార్టీ కి ఉపయోగపడేలాగా ఉన్న సినిమాలనే చెయ్యాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నాడట బాలయ్య.

    అంతే కాకుండా సెంటిమెంట్స్ ని బాలయ్య ఫాలో అయ్యినట్టు ఇండస్ట్రీ లో ఎవ్వరూ ఫాలో అవ్వారంటారు, ఈ చిత్రం విషయం లో కూడా ఆయన అదే చేస్తున్నాడు. 2014 ఎన్నికల సమయం లో ‘లెజెండ్’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వెంటనే తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రావడం జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉండేట్టు ప్లాన్ చేసుకున్నాడట, పోయినసారి లాగానే ఈసారి కూడా కలిసి వస్తుందో లేదో చూడాలి.