Akhanda 2 OTT Release: ఈమధ్య కాలం లో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా, థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. మూడేళ్ళుగా ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం థియేటర్స్ లో విడుదలై, సూపర్ హిట్ రేంజ్ ని సొంతం చేసుకున్న తర్వాత, నాలుగు వారాల్లోనే నెట్ ఫ్లిక్స్ లో దర్శనమించింది. అన్ని సినిమాలు దాదాపుగా ఇంతే. రీసెంట్ గా విడుదలై థియేటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) కూడా ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. కేవలం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో అప్లోడ్ చేసుకోవచ్చు అని నిర్మాతలు ఒప్పందం కూడా చేసుకున్నారు.
అందుకే హిందీ థియేట్రికల్ రిలీజ్ భారీ రేంజ్ లో లేదు. అక్కడ థియేట్రికల్ రిలీజ్ ఉండాలంటే కచ్చితంగా థియేటర్స్ లోకి వచ్చిన 8 వారాలు తర్వాతే హిందీ వెర్షన్ ని ఓటీటీ లో విడుదల చేయాలి. కానీ నిర్మాతలు భారీ రేట్ కోసం 4 వారాలకే ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ లో జనవరి 9 న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే రోజున ప్రభాస్ రాజా సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఆడియన్స్ కి ఒకవేళ రాజా సాబ్ టికెట్స్ దొరక్కపోతే, ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ‘అఖండ 2’ చిత్రం చూసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు థియేటర్స్ నుండి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మరో 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.
మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. నేటి నుండి ఈ చిత్రానికి అసలు సిసలు పరీక్ష మొదలు కాబోతుంది. వర్కింగ్ డే అవ్వడం తో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ నిన్నటితో పోలిస్తే 70 శాతం కి పైగా డ్రాప్స్ నూన్ మరియు మ్యాట్నీ షోస్ కి నమోదు అయ్యినట్టు తెలుస్తోంది. ఇది సినిమా భాషలో చూస్తే డిజాస్టర్ రేంజ్ అనే చెప్పొచ్చు. 50 శాతం డ్రాప్స్ ఉంటే యావరేజ్ రేంజ్ అనుకోవచ్చు. అంతకు మించి డ్రాప్స్ అంటే డిజాస్టర్ అనే అనాలి. థియేట్రికల్ రన్ ఈ వారం తోనే ముగిసిపోయేట్టు అనిపిస్తే ఈ చిత్రం జనవరి 9 వరకు కూడా ఆగదు, ఈ నెలలోనే విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.