Akhanda 2 Censor Talk: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 : Thandavam) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ మెంబెర్స్ ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ అందించారు. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందట. అయితే ట్రైలర్ లో ఉన్న మాస్ సన్నివేశాలను చూసి, ఈ రేంజ్ హింస ఉంది కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి A సర్టిఫికేట్ వస్తుందని అంతా అనుకున్నారు. UA రావడం నిజంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెన్సార్ బోర్డు మెంబెర్స్ పై విరుచుకుపడుతున్నారు. ఓజీ లో కొన్ని సన్నివేశాలు హిమసాత్మకంగా ఉన్నందుకు A సర్టిఫికేట్ ఇచ్చేసారు, అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే బాలయ్య మనుషులను వస్తువులు విసిరినట్టు విసురుతున్నాడు, అలాంటి సినిమాకు UA ఇవ్వడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: చెంపలు పగులుతాయి… కెమెరాలు ధ్వంసమవుతాయి.. బాలయ్య ‘అఖండ’ తాండవమిదీ
ఇక ఈ సినిమా సెన్సార్ టాక్ విషయానికి వస్తే, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అభిమానులకు ఈ చిత్రం తెగ నచ్చుతుందని తెలుస్తోంది. కానీ మామూలు ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ రేంజ్ లో అనిపిస్తది అంటున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ అనేక సన్నివేశాల్లో అద్భుతంగా ఉన్నాయి కానీ, ఇంటర్వెల్ సమయం లో మాత్రం చెవులు తూట్లు పడేలా బాగా లౌడ్ గా ఉందని, ఆడియన్స్ కాస్త తలనొప్పి ఫీల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంటూ చెప్పారట. కానీ నాలుగు యాక్షన్ సన్నివేశాలు మాత్రం రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఉంటాయట. తల్లి సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యిందట. కానీ అఖండ చిత్రానికి పాటలు ఎంత ప్లస్ అయ్యాయో, ఈ సినిమాకు అంత మైనస్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
ఓవరాల్ గా ఈ చిత్రం ఫ్యాన్స్ కి అద్బుతంగా నచుతుంది , మామూలు ఆడియన్స్ కి యావరేజ్ అనిపితుంది. మొన్న విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎలాంటి పికప్ లేదు. 1 మిలియన్ డాలర్ మార్కుని కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబడుతుందని అనుకుంటే, ఫుల్ రన్ లో కూడా కష్టం అనేలా ఉంది. కచ్చితంగా టాక్ మీద ఆధారపడిన సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ ఓపెనింగ్స్ రావొచ్చు కానీ, తెలంగాణ, ఓవర్సీస్ లో మాత్రం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇతర భాషల్లో ఎంతమేరకు ఈ చిత్రం వసూళ్లను రాబడుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.