Labour Codes 2025: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు లేబర్ కోడ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ లేబర్ కోడ్ ల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు కొన్నిరకాల సౌకర్యాలు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీటిలో పని గంటల విషయంలో కొత్తగా వచ్చిన రూల్స్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇప్పటివరకు పది నుంచి 12 గంటల పాటు పనులు చేయించుకొని జీతం తక్కువగా ఇచ్చేవారు. అదనంగా పనిచేసినా కూడా అదనపు ఆదాయం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్స్ ఏం చెబుతుందంటే?
Also Read: కాంతార దెయ్యం అంటూ ఇమిటేట్ చేసిన రణ్ వీర్.. ఏసుకుంటున్న కన్నడిగులు…
చాలా కంపెనీలు, సంస్థలు ఉద్యోగుల నుంచి శ్రమ దోపిడీ చేస్తున్నాయని కొన్ని రకాల ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉంటాయి. పని గంటలకంటే ఎక్కువ సమయం వర్క్ చేయించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటుంటారు. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన లేబర్ కోడ్ ప్రకారం ఒక ఉద్యోగి ఒక సంస్థ లేదా కంపెనీలో 8 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇందులో విశ్రాంతి సమయాన్ని తీసేయాల్సి ఉంటుంది. రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటలు పనిచేసినా సరిపోతుంది. ఒక గంట అదనంగా చేయాల్సివస్తే అందుకు సంబంధించి ఓవర్ డ్యూటీ ఆదాయం లెక్కించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు ఇలా అదనంగా డ్యూటీ చేయించుకొని ఏమాత్రం డబ్బులు ఇవ్వరు. ఇలాంటి సమస్య ఎదుర్కొన్న వారు 155214 అనే నెంబర్ కు కాల్ చేసి చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును స్వీకరించిన లేబర్ కమిషనర్ సంబంధిత కంపెనీ లేదా సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఉద్యోగి లేదా కార్మికుడికి లేబర్ చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా కంపెనీలు లేదా సంస్థలు వివిధ కారణాలతో అదనంగా పనులు చేయించుకునేవారు. ఇలా చేయించుకొని ఏమాత్రం ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అదనంగా పనిచేసిన వారికి అదనంగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా లేబర్ కోడ్ ద్వారా కొత్తగా ఈపీఎఫ్ ఎక్కువ మొత్తంలో కట్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మినిమం 5 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తే గ్రా డ్యూటీ చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం పనిచేసినా కూడా గ్రాడ్యుటి చెల్లిస్తారు. అంతేకాకుండా gig వర్కర్లు కొత్తగా ఈపీఎఫ్ ను పొందే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలి. ఇలా అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని అంటుండగా.. కార్మిక సంఘాలు మాత్రం వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ కార్మిక చట్టాలతో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చేస్తున్నారని.. యాజమాన్యాల ఒత్తిడితోనే వీటిని తయారు చేశారని ఆరోపిస్తున్నారు.