Akhanda 2 AI Video: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 : Tandavam) వచ్చే నెల 5వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా, సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా మేనియా నే కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో కావాల్సినంత బజ్ ని మాస్ ఆడియన్స్ లో ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, మొన్న విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ తో మరింత హైప్ ని ఏర్పాటు చేసుకుంది. కొన్ని షాట్స్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే రేంజ్ లో ఉన్నాయని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ముఖ్యంగా బాలయ్య గదతో టెర్రరిస్ట్స్ ని కొట్టే సన్నివేశం లో హనుమంతుడితో ఆయన్ని పోల్చడం హైలైట్ షాట్ గా నిల్చింది. ఇలాంటి షాట్స్ సినిమాలో బోలెడన్ని ఉన్నాయని, ఎన్ని బస్తాల పేపర్స్ తీసుకెళ్లిన అభిమానులకు సరిపోవని ఆ చిత్ర నిర్మాత చెప్పుకొచ్చాడు.
Also Read: కాంతార దెయ్యం అంటూ ఇమిటేట్ చేసిన రణ్ వీర్.. ఏసుకుంటున్న కన్నడిగులు…
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాలయ్య తో కొన్ని మేకింగ్ సన్నివేశాలు చూపించారు. వీటిల్లో బాలయ్య కెమెరా లను కొట్టడం, షూటింగ్ సెట్స్ లో అడ్డొచ్చిన ప్రతీ ఒక్కరిని గదతో బాదడం, చివరికి లాస్ట్ షాట్ కి ముందు బోయపాటి శ్రీను ని కూడా కొట్టడం, చివర్లో గన్ పెళ్లి బాలయ్య నే క్రిందకి పడిపోవడం వంటివి ఈ మేకింగ్ వీడియో లో చూపించారు. దీనిని చూసిన వెంటనే వామ్మో, ఇలా తీశారేంటి ఈ సినిమాని, నిజంగానే బాలయ్య ఆ రేంజ్ లో షూటింగ్ సెట్స్ లో అల్లాడించాడా అని ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. కానీ ఇది నిజమైన వీడియో కాదని తెలిసి షాక్ కి గురయ్యారు. సోషల్ మీడియా లో బాలయ్య పై ఫన్నీ ట్రోల్ వీడియోస్ రావడం సర్వసాధారణమే.
అందులోనూ బోయపాటి శ్రీను , బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాల్లో ఫైట్ సన్నివేశాలు కాస్త ఓవర్ గానే ఉంటాయి, అది నేటి జనరేషన్ ఆడియన్స్ కి కామెడీ గా అనిపిస్తూ ఉంటాయి, అందుకే ఇలాంటి ఫన్నీ ట్రోల్ వీడియోస్ ని చేస్తూ ఉంటారు. కేవలం ఇదొక్కటే కాదు, అఖండ లోని అఘోర గెటప్ లో ఉన్న బాలయ్య, సూపర్ హీరోస్ అయినటువంటి ఐరన్ మ్యాన్, హల్క్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్ ఇలాంటి గొప్ప గొప్పవాళ్లకు ఆయన హిమాలయ పర్వతాల్లో ట్రైనింగ్ ఇచ్చి పంపినట్టు కూడా ఒక AI వీడియో ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా లో ఎలా ఉన్నా, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ కి బయట లక్షల్లో అభిమానులు ఉన్నారు. మంచి హైప్ కూడా ఉంది, టాక్ రావడం ఒక్కటే మిగిలి ఉంది, ఆ తర్వాత బాలయ్య విలయతాండవం చూడొచ్చు.
Don’t miss climax pic.twitter.com/iKX5k7utKq
— Sachin4JSP (@Sachin4JSP) November 29, 2025