Akhanda 2 Release Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR)…ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య (Balayya)ఇప్పుడు అఖండ 2 (Akhanda 2) సినిమాతో మరో సక్సెస్ ని తను ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు… సంక్రాంతి కానుక వచ్చిన ‘డాకు మహారాజు’ (Daaku Maharaj) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అదే రీతిలో ఈ సంవత్సరమే దసర కానుకగా అఖండ 2 సినిమాని బరిలోకి దింపబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది… అయితే సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే అంతకుముందే పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజి సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వాళ్లు ఒక డేట్ ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఆ తర్వాత బాలయ్య బాబు అఖండ 2 సినిమాను కూడా అదే డేటు నా తీసుకొస్తున్నాం అంటూ అనౌన్స్ చేయడం పట్ల కొంతమంది కొన్ని రకాల విమర్శలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా బాలయ్య బాబు కూడా అదే డేట్ కి వస్తాడా లేదంటే పోస్ట్ పోన్ చేసుకుంటాడా? అనే దానిమీద రకరకాల ఊహగానాలైతే వ్యక్తమవుతున్నాయి.
Also Read: ‘హరిహర వీరమల్లు’ మూవీ స్టోరీని మార్చమని పవన్ కళ్యాణ్ చెప్పారా..?
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి బాలయ్య బాబు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి బాలయ్య బాబుకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ముందుగా లాక్ చేసిన డేట్ కాబట్టి బాలయ్య మధ్యలో ఆ డేట్ ని అనౌన్స్ చేశాడు.
అందువల్లే బాలయ్య బాబు కాంప్రమైజ్ అయితేనే బాగుంటుందని కొంతమంది సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… అఖండ సినిమా ఎంత పెద్ద భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. కాబట్టి అఖండ 2 సినిమాకి కూడా పోటీ లేకుండా సోలో రిలీజ్ గా వస్తే మంచి ఆదరణ దక్కుతుంది.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
అలా కాకుండా పవన్ కళ్యాణ్ తో పోటీ పడితే మాత్రం బాలయ్య సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు… ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలంటే మరి కొద్ది రోజులు వెయిట్