HHVM Movie Story Change: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్(Pavan Kalyan)… ఆయన గత కొన్ని సంవత్సతరాల నుంచి పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంటున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతి సారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు కొంతవరకు అంచనాలైతే తగ్గాయి. మరి ఏది ఏమైనా కూడా భారీ ఓపెనింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న హరిహర వీరమల్లు ఇప్పటికి హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది అంటూ సినిమా మేకర్స్ చెబుతున్నారు… మొదట ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే ఫస్టాఫ్ సినిమాని నిలబెట్టినప్పటికి సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని గ్రాఫికల్ వర్క్ కు సంబంధించిన సీన్స్ ప్రేక్షకులను పెద్దగా ఇంపాక్ట్ అయితే గురి చేయలేకపోయాయి. దానివల్లే ఈ సినిమా డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
అలా కాకుండా క్రిష్ రాసిన కథని ఆయన తెరకెక్కిస్తే బాగుండేది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సెకండాఫ్ లో సనాతన ధర్మం గురించి కొన్ని సన్నివేశాలైతే వచ్చాయి. దానికి క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తర్వాత ఏ ఏం రత్నం కొడుకు కూడా జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేశాడు.
ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి కొన్ని సన్నివేశాలు ఉండేలా చూసుకోమని చెప్పినట్టుగా తెలుస్తోంది. దాని కోసమే కావాలనే ఇందులో సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను పెట్టారు అంటు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు…ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను కూడా సాగిస్తున్నాడు. అలాగే టిడిపి, బిజెపితో పొత్తు కూడా పెట్టుకున్నాడు. ఇక బిజెపి అంటే హిందుత్వ పార్టీ కాబట్టి సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తూ ఉంటుంది.
Also Read: ‘నీ అబ్బా’ అంటూ యాంకర్ ప్రదీప్ పై రెచ్చిపోయిన నిహారిక కొణిదెల!
అందుకోసమే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలను ఉండేలా చూసుకున్నాడు అంటూ మరి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… ఇక పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడతాయని అందరూ భావిస్తున్నారు. సుజీత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజి సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్రమైన ఆశలైతే ఉన్నాయి…