HHVM Krish Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. చాలా మంది డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ముఖ్యంగా క్రిష్ (Krish) లాంటి డైరెక్టర్ మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే ఆయనకు సక్సెస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఇక ఇప్పుడు ఆయన అనుష్క(Anushka)తో ఘాటి (Ghati) అనే సినిమా చేస్తున్నాడు. తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఆయన స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు సినిమా 40% షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. రోజురోజుకి సినిమా డిలే అవుతున్న కొద్ది ఆ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరి ఎట్టకేలకు ఈ సినిమాని జ్యోతి కృష్ణ డైరెక్షన్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమా డివైడ్ టాక్ తో రన్ అవుతోంది.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
ఇక క్రిష్ కథతో తెరకెక్కిన సినిమా కాబట్టి ఆయన కథ రాసినందుకు గాను ఆయన 40% షూట్ చేసినందుకుగాను అతనికి రెమ్యునరేషన్ గా 5 కోట్ల వరకు డబ్బులు చెల్లించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా క్రిష్ లాంటి దర్శకుడు రాసిన కథ అంటే అందులో చాలా డెప్త్ అయితే ఉంటుంది.
ఆయన సినిమాని చాలా రియలేస్టిక్ గా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు. అలాగే ప్రేక్షకుడికి అందజేయడంలో కూడా ఆయన చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి…అతని సినిమాలను అబ్జర్వ్ చేస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది…మరి అలాంటి క్రిష్ హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడం అనేది పవన్ కళ్యాణ్ అభిమానులను కొంతవరకు కలవరం పెట్టినప్పటికి,
Also Read: ‘హరిహర వీరమల్లు’ మూవీ స్టోరీని మార్చమని పవన్ కళ్యాణ్ చెప్పారా..?
ఆయనకి ఈ సినిమా వల్ల ఎదురైన ఇబ్బందులను అలాగే తన పర్సనల్ విషయాలన్నింటిని కలగలిపి క్రిష్ కొంచెం డిప్రెషన్ లో ఉండిపోయారట. అందువల్లే ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి కంబ్యాక్ ఇచ్చి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…