Romantic: పూరి జగన్నాథ్ సినిమాల్లో కాస్త ఘాటుగానే రొమాన్స్ ఉంటుంది. ఇక బోల్డ్ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. పూరి మాటలన్నీ అలాగే ఉంటాయి. అయితే, పూరి స్వయంగా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ రొమాంటిక్. పూరి తనయుడు ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా షూట్ సమయంలో ఆకాష్ కి విచిత్రమైన అనుభవాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి అట. తండ్రి ముందే.. హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేయాల్సి వచ్చిందట.

కెమెరా ముందు అయితే, ఎలాంటి రొమాన్స్ అయినా చేయవచ్చు. కానీ తండ్రి ముందే హీరోయిన్ తో హాట్ హాట్ గా నటించడటం అంటే ఏ నటుడికైనా అది బాగా ఇబ్బంది పెట్టేదే. అందుకే ఆకాష్ కూడా నటించే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఒకపక్క హీరోయిన్ రెచ్చిపోయి నటిస్తుంటే.. ఆకాష్ మాత్రం సైలెంట్ గా కామ్ గా దూరం దూరంగా ఉంటూ నటించడానికి ప్రయత్నం చేశాడట.
ఆ సమయంలో పూరి కొడుకు పై సీరియస్ అయ్యాడట. ‘ఏమి చేస్తున్నావ్ ? స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టు చెయ్’. అని అందరి ముందు తిట్టాడట. అప్పుడు ఆకాష్ కూడా ‘తండ్రి ముందు ఏ కొడుకు అయినా హీరోయిన్ తో ఇలాంటి రొమాన్స్ చేస్తాడా ? ‘నువ్వు ఎక్కడి నుంచి దూకమంటే అక్కడి నుంచి దూకుతా డాడీ. దయచేసి ఈ రొమాన్స్ ను మాత్రం తగ్గించు నాన్నా’ అంటూ రిక్వెస్ట్ చేశాడట.
కానీ పూరి మాత్రం ‘సినిమాలో రొమాన్స్ నే కీలకం, సినిమా పేరే రొమాంటిక్, అలాంటిది రొమాన్స్ లేకపోతే ఇక సినిమా ఎవడు చూస్తాడురా ? రొమాన్స్ తగ్గించడం కుదరదు, నేను పక్కకి వెళ్తున్నా.. జాగ్రత్తగా చేయి’ అంటూ పూరి పక్కకి వెళ్ళాడట. ఇదంతా గోవా షెడ్యూల్ లో జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ రొమాన్స్ మాత్రమే ఇప్పుడు ఈ సినిమాని మాస్ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఉపయోగపడింది.
Also Read: Mahesh Babu: మహేష్ కి పాన్ ఇండియా బడ్జెట్ లేకపోతే ఎలా ?
ఐతే, పూరి రాసిన రొమాన్స్ గురించి తాజాగా ఆకాష్ మాట్లాడుతూ.. ‘నిజానికి నాన్న ఈ కథ రాసిన వెంటనే నాకు చెప్పారు. ఇదొక రొమాంటిక్ ఫిల్మ్ అనుకున్నాను.మొదట నాన్న గారు ఈ కథను నాతో చేయాలి అని అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడే ఆయన వేరే హీరోని ముఖ్యంగా విజయ్ దేవరకొండను ఊహించుకున్నారు. అయితే ఓరోజు నన్ను పిలిచి.. నువ్వే ఈ సినిమాలో హీరో అనగానే నేను షాక్ కి గురయ్యాను’ అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. మరి ఈ రొమాంటిక్ ఆకాష్ కి హిట్ ను ఇస్తుందా ? చూడాలి.
Also Read: Katrina Kaif: త్వరలో పెళ్లి వధువు గా మారుతున్న కత్రినాకైఫ్