Guntur Police: ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యం చేసుకుంటాడు. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటాడు. వారికి సహాయం చేసే పేరుతో శారీరకంగా లోబరుచుకుంటాడు. తన కోరిక తీర్చుకుని చివరకు బ్లాక్ మెయల్ కు సైతం దిగి తనలోని కర్కశత్వాన్ని బయటపెడతాడు. అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తానని బెదరిస్తాడు. మాట వినకపోతే తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని అందరిని మోసం చేశాడు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ మహిళ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. దీంతో అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చే కానిస్టేబుల్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దీంతో కుటుంబానికి తోడుగా ఉంటానని నమ్మించి ఓసారి ఇంటికి వెళ్లి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు.
జరిగిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి మిన్నకుండిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడు పలుమార్లు తన స్నేహితులను తీసుకొచ్చి ఆమె కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి ఎదురుతిరిగిన ఆమెను నమ్మించి విజయవాడ తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అతడి కన్ను మాత్రం కుమార్తె పై నుంచి పోలేదు. మాట వినకపోతే చంపుతానంటూ కూతురును అనుభవించాలని పథకం వేశాడు.
Also Read: Huzurabad By Election 2021: ఎవరెన్ని చెప్పినా హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్స్ అదే..
దీంతో విసిగిపోయిన ఆమె గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతడికి నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు తెలిసింది. దీంతో రెండో భార్య ఫిర్యాదుతో కానిస్టేబుల్ రహస్యాలన్ని బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు అతడి అరెస్టుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహిళలను మోసం చేస్తున్న మృగాడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మాంసంలో అంత్రాక్స్.. మాంసాహారులు జాగ్రత్త