Ajnathavasi : ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక జల్సా లాంటి సెన్సేషనల్ హిట్ వచ్చింది, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. అలా రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసిన సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రం ఎంతటి భారీ అంచనాల నడుమ విడుదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాకి ఎలాంటి క్రేజ్ అయితే ఉన్నిందో, అంతకు మించిన క్రేజ్ ఈ సినిమాకి విడుదలకు ముందు ఏర్పడింది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లో అనకాపల్లి నుండి, అమెరికా వరకు టికెట్ ముక్క కూడా దొరకలేదు.
అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పీడకల లాంటిది. అర్థరాత్రి ఎంతో ఉత్సాహంగా షో చూసి ఎంజాయ్ చేద్దామని థియేటర్స్ లోపలకు అడుగుపెట్టిన అభిమానులు తిరిగి వెళ్ళేటప్పుడు విచారమైన ముఖాలతో వెళ్లాల్సి వచ్చింది వచ్చింది. అంత ఘోరంగా నిరాశపర్చింది ఈ సినిమా. బెనిఫిట్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవ్వబోతుందని లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, అనిరుద్ కాంబినేషన్ లో ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెరక్కబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పుకారు షికార్లు చేస్తుంది. 2029 ఎన్నికలకు ముందు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఇదే పవన్ కళ్యాణ్ చివరి చిత్రమని అంటున్నారు.
‘అజ్ఞాతవాసి’ కూడా పవన్ కళ్యాణ్ చివరి చిత్రమని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. బహుశా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో సక్సెస్ అయ్యుంటే సినిమాలకు దూరమయ్యేవాడేమో. ఇప్పుడు అధికారం లోకి వచ్చిన తర్వాత చేతిలో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసేందుకు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నాడు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాకి షిఫ్ట్ అవుతాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.