Recharge Plans
Recharge Plans : ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) తన వినియోగదారులకు నిరాశ కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.509, రూ.1,999 రీఛార్జి ప్లాన్లలో డేటా సదుపాయాలను పూర్తిగా తొలగించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. వాయిస్ , ఎస్సెమ్మెస్ సేవల కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రూ.509 ప్లాన్:
* వ్యాలిడిటీ: 84 రోజులు
సర్వీసులు :
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
* 900 ఎస్సెమ్మెస్‌లు
* డేటా: తాజాగా తొలగించబడింది
రూ.1,999 ప్లాన్:
* వ్యాలిడిటీ: 365 రోజులు
సర్వీసులు :
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
* 3,600 ఎస్సెమ్మెస్‌లు
* డేటా: తాజాగా తొలగించబడింది
ఎయిర్‌టెల్ వివరణ:
ఈ మార్పులపై స్పందించిన ఎయిర్‌టెల్, సాంకేతిక సమస్యల కారణంగా ఈ గందరగోళం ఏర్పడిందని పేర్కొంది. ఈ ప్లాన్లను తాత్కాలికంగా వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది.
ట్రాయ్ ఆదేశాల ప్రభావం:
ప్రస్తుతం టెలికాం వినియోగదారులు వాయిస్, ఎస్సెమ్మెస్, డేటా సేవలు కలిపిన ప్యాకేజీలను మాత్రమే పొందుతున్నారు. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా వినియోగదారులు తప్పనిసరిగా రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ టెలికాం సంస్థలను వాయిస్, ఎస్సెమ్మెస్ సేవల కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ సూచనల ప్రకారం ఎయిర్‌టెల్ తన రూ.509, రూ.1,999 ప్లాన్లలో డేటా ప్రయోజనాలను తొలగించింది.
ప్రస్తుత పరిస్థితి:
ఈ రెండు ప్లాన్లు ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. ఇదే తరహా నిర్ణయాలు ఇతర టెలికాం కంపెనీల నుంచీ కూడా వచ్చే అవకాశముందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. వినియోగదారులు డేటా, వాయిస్ సేవల కోసం ప్రత్యేక ప్లాన్లను ఎంచుకునే విధంగా టెలికాం రంగం త్వరలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. జియో కూడా డేటా ఉండే రూ. 479 వ్యాక్ ధరను జియో రూ.50 పెంచి రూ.539గా నిర్ణయించింది. 1,999 ప్లాన్ లకు 350 పెంచి రూ.2,249 చేసింది.