ఆ గౌరవం కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్ళింది. ఒకప్పటి ఈ అగ్ర కథానాయిక, ఒకప్పటి ఈ పాపులర్ బాలనటి అలా సినిమాలకు పూర్తిగా దూరం అయింది. ఇంతకీ అజిత్ తో ప్రేమ గురించి ఆ మధ్య షాలిని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘అజిత్ గారితో నేను ‘అమర్కలం’ సినిమా, తెలుగులో వచ్చేసరికి ‘అద్భుతం’ అనే పేరుతో విడుదలైంది. హా.. ఆ సినిమా చేస్తోన్న సమయంలో బాగా క్లోజ్ అయ్యాను.
ఒకరోజు షూటింగ్ లో ఏదో లవ్ సీన్ చేయాల్సి వచ్చింది. స్వతహాగా అజిత్ కి కాస్త సిగ్గు ఎక్కువ. సీన్ చూస్తే ఇద్దరం ఘాడంగా హత్తుకు పోవాలి. మేము మొదట ఇబ్బంది పడుతూనే అలా హత్తుకుపోయాము. షాట్ ఓకే, డైరెక్టర్ కట్ చెప్పాడు. కానీ, మాకు ఏమి వినిపించడం లేదు. అంతగా ఆ లవ్ సీన్ లో మేము లీనం అయిపోయాము. అందరూ షాక్ గా చూస్తున్నారు.
యూనిట్ సభ్యులు కదిపితే గానీ, మేము ఈ లోకంలోకి రాలేదు. అలా అజిత్ తో ప్రేమలో పడ్డాను అంటూ షాలిని చెప్పుకొచ్చారు. అయితే అజిత్ తో పెళ్లి తర్వాత, సినిమాలకు గుడ్ బై చెప్పే విషయంలో మాత్రం అది పూర్తిగా తన నిర్ణయమేనట. ‘ప్రియద వరుమ్ వేండుం’ అనే తమిళ సినిమా చేస్తోన్న సమయంలో చాల అలిసిపోయి షాలిని ఇంటికి వస్తే..
అజిత్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి తన షూటింగ్ మానుకున్నాడు. అంతే, ఆ తర్వాత రోజు నుండి షాలిని సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి, ఇక నుండి కేవలం తన భర్త బాగోగులు మాత్రమే చూసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, మళ్ళీ షాలిని వెండితెర పై కనిపించబోతుంది. మణిరత్నం తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో షాలిని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిరత్నం కోరిక మీదట ఆమె ఈ పాత్రను చేస్తున్నారు.
అజిత్, షాలినిలకు ఇద్దరు పిల్లలు. కూతురు టీనేజ్ లోకి వచ్చింది. షాలిని ఇకపై మరిన్ని సినిమాల్లో నటిస్తారా అనేది చూడాలి. ఆమె భర్త అజిత్ ఇప్పుడు కోలీవుడ్ లో బిగ్ సూపర్ స్టార్. తమిళనాడు లో బాగా మాస్ క్రేజున్న స్టార్స్ ఇద్దరే… ఒకరు అజిత్, మరొకరు విజయ్.