Ajith : సౌత్ లో ప్రతీ సూపర్ స్టార్ ఇంటర్వ్యూస్/ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొనడం సర్వసాధారణం. కానీ తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్(Thala Ajith Kumar) మాత్రం ఇంటర్వ్యూస్ కి, మూవీ ఈవెంట్స్ కి చాలా దూరంగా ఉంటాడు. ఇంటర్వ్యూస్ ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కేవలం 15 మాత్రమే ఇచ్చాడు. ఇక మూవీ ఈవెంట్స్ లో అయితే కెరీర్ ఆరంభం లో పాల్గొనేవాడు, ఇప్పుడైతే ఈవెంట్స్ కి ససేమీరా నో చెప్తున్నాడు. ఎక్కువగా అభిమానులతో టచ్ లేకుండా, చాలా ప్రైవేట్ లైఫ్ ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు అజిత్. అలాంటి వ్యక్తి చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండియా టుడే అనే ప్రముఖ నేషనల్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రీసెంట్ గానే ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : మరోసారి పల్టీలు కొట్టిన హీరో అజిత్ కార్..వణుకుపుట్టిస్తున్న విజువల్స్!
మొన్న రాత్రి ఆయన రాష్ట్రపతి భవన్ కి వెళ్లి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇండియా టుడే కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన సతీమణి షాలిని గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నా భార్య షాలిని చేసిన త్యాగాల కారణంగానే నేను ఈరోజు ఈ స్థానం లో ఉన్నాను. షాలిని కి ఒకప్పుడు అద్భుతమైన కెరీర్ ఉండేది, ఆమెని లక్షలాది మంది అభిమానించేవారు. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వాటిని త్యాగం చేసింది. కేవలం ఒక గృహిణి గా మాత్రమే పరిమితమైంది. నేను జీవితం లో తీసుకున్న ప్రతీ నిర్ణయం లో ఆమె తోడుగా నిల్చింది. కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఆమె నా వెనుక సపోర్టుగా నిల్చింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే నేను జీవితం లో సక్సెస్ కాగలిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు అజిత్.
మీరు సౌత్ లో చాలా పెద్ద సూపర్ స్టార్, కానీ మిమ్మల్ని అభిమానులు సూపర్ స్టార్ అని పిలవడం, తల అని పిలవడం ఇష్టం ఉండదట, ఎందుకు అలా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అజిత్ సమాధానం చెప్తూ ‘ఎందుకు అలా పిలవడం..నేను ఒక నటుడిని, సినిమాలు చేస్తాను, అందుకు నేను డబ్బులు తీసుకుంటాను, అంతే అంతకు మించి ఏమి లేదు ఇలాంటి ట్యాగ్స్ కేవలం పనికి వచ్చే బై ప్రొడక్ట్స్ లాంటివి. నాకు ఇలాంటి వాటిపై ఆసక్తి లేదు. అందుకే నన్ను అజిత్ కుమార్, లేదా AK అని పిలవమని చెప్తుంటాను’ అని చెప్పుకొచ్చాడు అజిత్ కుమార్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది కేవలం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి మొదటి భాగం మాత్రమే, ఇంకా చాలా మిగిలి ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : నెలకు 15 కోట్లు..5వ తేదీ దాటితే నిర్మాతలకు చుక్కలే అంటున్న అజిత్!