Ajith : మన సౌత్ ఇండియా లో అభిమానులు ఆరాధ్య దైవం లాగా కొలువబడే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువమంది సూపర్ స్టార్స్ లో ఒకరు తల అజిత్ కుమార్(Thala Ajith Kumar). తమిళనాడు లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో అజిత్ సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. ప్రస్తుతం ఇండియా మొత్తం బలమైన కంటెంట్ తో తెరకెక్కే సినిమాలను మాత్రమే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. స్టార్ స్టేటస్ తో సినిమాలు నడిచే రోజులు పోయాయి. కానీ ఇప్పటికీ స్టార్ స్టేటస్ తో తమ సినిమాలకు ఓపెనింగ్స్ రప్పించడమే కాకుండా, భారీ లాంగ్ రన్ ని కూడా తెప్పించే హీరోలున్నారు. వారిలో అజిత్ ఒకరు. సాధారణంగా ఇంటర్వ్యూస్ ఇవ్వని అజిత్ రీసెంట్ గానే ఇండియా టుడే కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : మరోసారి పల్టీలు కొట్టిన హీరో అజిత్ కార్..వణుకుపుట్టిస్తున్న విజువల్స్!
ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వ రంగం లో పనిచేసే ఒక సాధారణమైన ఉద్యోగిని,కొన్నాళ్ళు ఒక ఆటో మొబైల్ కంపెనీ లో కూడా పని చేశాను. సినీ ఇండస్ట్రీ లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు 18 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు రేసింగ్ మీద ఆసక్తి కలిగింది. నా తల్లితండ్రులకు రేసింగ్ లోకి వెళ్తానని చెప్పాను. దానికి వాళ్ళు షాక్ కి గురయ్యారు, నువ్వు రేసింగ్ లోకి వెళ్లాలని అనుకుంటే వెళ్ళు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ దానికి ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేయాలి, అందుకు మా దగ్గర డబ్బులు లేవు. నువ్వే సంపాదించుకొని, రేసింగ్ లోకి వెళ్ళు అని చెప్పారు. దీంతో ఎలా చెయ్యాలి అని నేను ఆలోచిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టమని చెప్పాడు. అప్పటి నుండి మోడలింగ్ లో పని చేస్తూ, వచ్చిన డబ్బులతో రేసింగ్ పోటీలలో పాల్గొనేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు.
సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ ‘మొదట్లో నాకు తెలుగు సినిమా ఆడిషన్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. నాకు అప్పట్లో తెలుగు ఒక్క ముక్క కూడా రాదు, నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేసాను. నా తల్లిదండ్రులకు నేను సినీ ఇండస్ట్రీ లోకి వెళ్తున్నాను అని చెప్పగానే ఆందోళనకు గురయ్యారు. మనకు పూర్తిగా సంబంధం లేని రంగం, అనవసరం కెరీర్ ని పాడు చేసుకుంటానని భయపడ్డారు. కానీ నాకు అదృష్టం కూడా కలిసొచ్చింది, సినీ రంగం లో సక్సెస్ అయ్యి స్టార్ గా ఎదిగాను. మొదట్లో నాకు అసలు నటన వచ్చేది కాదు. నా మొదటి సినిమాలో నటనను చూస్తే పారిపోతారు. నా గొంతు కూడా సరిగా ఉండేది కాదు, డబ్బింగ్ చెప్పేవాళ్ళు. కెరీర్ ప్రారంభం లో నా వాయిస్ ని వెక్కిరిస్తూ ఇప్పటికీ మిమిక్రీ చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ నేను పట్టించుకోకుండా, నన్ను నేను మెరుగు పర్చుకుంటూ వెళ్ళాను. ఎవ్వరైనా సినిమాల్లోకి ఎందుకు వచ్చావని అడిగితే, వ్యాపారం లో బాగా నష్టపోయి అప్పుల పాలయను, డబ్బులు సంపాదించి ఆ అప్పులను తీర్చడానికే ఈ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను అని చెప్పేవాడిని’ అంటూ అజిత్ చెప్పుకొచ్చాడు.
Also Read : నెలకు 15 కోట్లు..5వ తేదీ దాటితే నిర్మాతలకు చుక్కలే అంటున్న అజిత్!