Mahesh and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా ఖరారై సెట్స్ మీదకు వచ్చేందుకు 15 ఏళ్ళ సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ మొదలైంది, ఇక ఫ్యాన్స్ కి పండగే అని ఆనందించేలోపు, ఈ చిత్రం నుండి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడం అభిమానుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఒడిశా లో మొదలై ఒక షెడ్యూల్ జరుపుకుంది. హమ్మయ్య, షూటింగ్ మొదలైంది, ఇక వేగంగా ఒక్కో షెడ్యూల్ లేపేస్తారులే అని అభిమానులు ఆనందించారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని రోజుల పాటు షూట్ చేసారు. రీసెంట్ గా జరిగిన నాని ‘హిట్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి షూటింగ్ నుండి నేరుగా ఇక్కడికి వచ్చారు అని నాని చెప్పగానే, అబ్బో ఈ సినిమా షూటింగ్ పరుగులు పెడుతుందని అభిమానులు సంతోషించారు.
Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…
హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో గత నాలుగైదు రోజుల నుండి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య ఒక పాట ని చిత్రీకరించాడు డైరెక్టర్ రాజమౌళి. నిన్నటితో ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఇక 40 రోజుల పాటు విరామం అట. మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసుకొని విదేశాలకు తన కుటుంబం తో కలిసి ట్రిప్ వెయ్యడానికి సిద్ధం అయిపోయాడు. 40 రోజుల విరామం తర్వాత కూడా వెంటనే షూటింగ్ మొదలవ్వదు. కొత్త షెడ్యూల్ కోసం వర్క్ షాప్ లో కనీసం ఒక మూడు వారాల పాటు పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్టిస్టుల డేట్స్ ని తీసుకొని సెప్టెంబర్, లేదా అక్టోబర్ నెల లో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంత నిదానంగా తీస్తే, ఈ సినిమా ఎప్పటికి రావాలి?, కనీసం ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టీజర్ ని అయినా విడుదల చేస్తే, ఒక మూడేళ్ళ పాటు దాంతోనే గడిపేస్తాము కదా అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మహేష్ బాబు అభిమానులు ఆన్లైన్ వదిలి వెళ్లిపోతున్నారు. ఎలాగో అప్డేట్స్ లేవు. ఇక ఆన్లైన్ లో కూర్చొని ఏమి చెయ్యాలి అనేది వాళ్ళ వాదన. కనీసం మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, మా సినిమా షూటింగ్ మొదలై ఇక్కడ వరకు వచ్చింది అనేది అయినా రాజమౌళి చెప్తాడా లేదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. భారీ విరామం తర్వాత మొదలయ్యే షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించినది అట. సుమారుగా మూడు వేల మంది ఫైటర్స్ తో మహేష్ పోరాడనున్నాడు.
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!