https://oktelugu.com/

Aishwarya Rajesh : ఆ క్రేజీ హీరోతో కలిసి డిన్నర్ డేటింగ్ కి వెళ్లాలని ఉందంటూ ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్!

పేరుకే తమిళ హీరోయిన్, కానీ చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తుంది. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో మంచి క్రేజ్ ఉన్న హీరో. దురదృష్టం కొద్దీ ఈ హీరోయిన్ చిన్నతనంలోనే ఆయన చనిపోవడం తో కుటుంబం మొత్తం చెన్నై లోనే స్థిరపడింది.

Written By: , Updated On : February 12, 2025 / 07:57 AM IST
Aishwarya Rajesh

Aishwarya Rajesh

Follow us on

Aishwarya Rajesh : పేరుకే తమిళ హీరోయిన్, కానీ చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగానే అనిపిస్తుంది. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో మంచి క్రేజ్ ఉన్న హీరో. దురదృష్టం కొద్దీ ఈ హీరోయిన్ చిన్నతనంలోనే ఆయన చనిపోవడం తో కుటుంబం మొత్తం చెన్నై లోనే స్థిరపడింది. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు కానీ, కేవలం ఆమె తన టాలెంట్ తోనే ఆడిషన్స్ లో ఎంపికై హీరోయిన్ గా మారింది. ఆమె మరెవరో కాదు, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). తమిళనాడు లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్, తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ కాలేదు కానీ, సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam)’ చిత్రం మాత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

ఈ ఒక్క సినిమాతో ఐశ్వర్య రాజేష్ క్రేజ్ మన తెలుగు లో ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన ఆమెని చూస్తుంటే, సౌందర్య ని చూసినట్టే అనిపించిందని అంటున్నారు ప్రేక్షకులు. అంత సహజం గా ఆమె నటించింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొట్టేసింది. ఈ అమ్మాయిలో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈమె తమిళ అమ్మాయి అంటే బహుశా ఎవ్వరూ నమ్మలేరు ఏమో,ఆ రేంజ్ లో నటించింది. అంతే కాకుండా ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో ఒక్కటి కూడా మిస్ కాకుండా పాల్గొనిండి. నిన్న కూడా ఈమె సక్సెస్ సెలెబ్రేషన్స్ లో హాజరై , సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ లో భాగంగా ఐశ్వర్య ని కొన్ని ప్రశ్నలు అడిగారు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మీకు ఒక హీరో తో డిన్నర్ చేయాలనీ అనిపిస్తే ఏ హీరో ని ఎంచుకుంటారు అని అడగగా, ఐశ్వర్య రాజేష్ నిమిషం కూడా ఆలోచించకుండా ఇలయథలపతి విజయ్ పేరు చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. దీనిని చూసిన సోషల్ మీడియా లోని కొంతమంది నెటిజెన్స్, అతనికి పెళ్లయిపోయింది, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, అతనితో డిన్నర్ కి ఏమి వెళ్తావు, మాతో రావొచ్చు కదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత తెలుగు లో కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి.