Homeవింతలు-విశేషాలుBeavers: ఆనకట్ట కట్టలేక అధికారులు చేతులెత్తేశారు.. చివరికి ఎలుకలు ఆ పని చేశాయి! ప్రభుత్వానికి ఎంత...

Beavers: ఆనకట్ట కట్టలేక అధికారులు చేతులెత్తేశారు.. చివరికి ఎలుకలు ఆ పని చేశాయి! ప్రభుత్వానికి ఎంత సొమ్ము ఆదా అయిందంటే!

Beavers: నాడు రాముడు, కోతులు కలిసి నిర్మించిన రామసేతు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.. మనుషులకు సాయం చేయడం లో జంతువులు ఎప్పటికీ ముందుంటూనే ఉంటాయి. ఉదాహరణకు కుక్కలను తీసుకుంటే.. మనిషికి అత్యంత నమ్మకమైన జంతువులుగా పేరుపొందాయి. విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. మన దేశ సైన్యం నుంచి మొదలు పెడితే.. రాష్ట్రస్థాయి పోలీసుల వరకు కుక్కలను భద్రతాపరమైన అంశాలలో ఉపయోగిస్తున్నారు. అశ్వాలను సైతం భద్రతాపరమైన పనులకు ఉపయోగించుకుంటున్నారు. అయితే చరిత్రలో తొలిసారిగా.. ఎలుకలు మనుషులకు ఉపయోగపడ్డాయి.. సాధారణంగా ఎలుకలపై శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రయోగాలు చేస్తుంటారు. వాటి మీద ప్రయోగాలు చేయగా వచ్చిన ఫలితాల ఆధారంగా ఔషధాలు, ఇతరత్రా ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. అయితే తొలిసారిగా శాస్త్ర సాంకేతిక రంగాలు కాకుండా.. నిర్మాణ సంబంధమైన పనుల్లో ఎలుకలు మనుషులకు ఉపయోగపడ్డాయి. అయితే ఇందులో మనుషుల ప్రమేయం లేకపోవడం విశేషం. పైగా ఎలుకలు చేసిన పని వల్ల ప్రభుత్వానికి ఏకంగా 10 కోట్లు ఆదా అయింది.

ఆనకట్ట నిర్మించాయి

సాధారణంగా ఎలుకలు ఇళ్లల్లో తాండవం చేస్తుంటాయి. ఆహార పదార్థాలను తింటాయి. గోడలకు రంధ్రాలు చేసి సర్వనాశనం చేస్తుంటాయి.. ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి కూడా నష్టాన్ని తలపెడతాయి. అయితే తొలిసారిగా ఎలుకలు ఒక ఆనకట్ట నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. అంతేకాదు ప్రభుత్వాధికారులు చేతులెత్తేసిన తరుణంలో.. స్వయంగా అవే రంగంలోకి దిగి ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. చెక్ పబ్లిక్ దేశంలోని బ్రీడి అనే రీజియన్ లో ఏడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిని నిర్మించాలని అధికారులు భావించారు. కాకపోతే ఆనకట్ట నిర్మాణంలో ఆలస్యం జరగడంతో పనులు ఆగిపోయాయి. అయితే ఈ ప్రాంతంలో బీవర్స్ అనే ఎలుకల వంటి ఉభయచరజీవులు ఆనకట్ట నిర్మాణంలో సహాయపడ్డాయి.. సాధారణంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం జరిగితే వాటి వ్యయం పెరుగుతుంటుంది. భారం అంతకంతకూ ఎక్కువవుతూ ఉంటుంది. బీవర్స్ అనే ఎలుకలు పుల్లలు, మట్టి, రాళ్లతో ఈ ఆనకట్టను నిర్మించాయి. సహజంగా ఈ ఎలుకలకు ఇలా పుల్లలు, మట్టి, రాళ్లతో ఆనకట్టను నిర్మించే లక్షణం ఉంటుంది. అందువల్లే బీవర్స్ ఎలుకలు ఈ ఆనకట్ట నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. బీవర్స్ అనే ఎలుకలు ఉభయచరజీవులు. ఇవి సహజంగా చైతన్యవంతంగా ఉంటాయి. పురుగులను తింటూ జీవిస్తుంటాయి. వీటికి బొరియలు చేయడం సహజ సిద్ధ లక్షణం.. పుల్లలు, మట్టి, రాళ్ళ మిశ్రమంతో కట్టల లాంటి నిర్మాణాలు చేపడతాయి. అయితే ఈ ఆనకట్ట నిర్మాణంలో బీవర్స్ ఎలుకలు పాలుపంచుకోవడం విశేషం.. ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ వంటివి లేకుండానే ఈ ఎలుకలు మా కోసం పని చేశాయని అధికారులు చెబుతున్నారు. ఎలుకలు నిర్మించిన ఆనకట్ట సుదీర్ఘకాలం వరకు చెక్కుచెదరదని వారు అంటున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version