Aishwarya Rajesh
Aishwarya Rajesh: ఈ ఉపోద్ఘాతం మొత్తం ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) గురించి. ఐశ్వర్య దివంగత నటుడు రాజేష్ కుమార్తె. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి ఈమెకు మేనత్త అవుతారు. ఐశ్వర్య ముందుగా తన అదృష్టాన్ని తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా పరీక్షించుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఆమె ఒక వ్యక్తి ప్రేమలో పడ్డారు. కొద్దిరోజులు కథ సజావుగానే నడిచింది. ఆ తర్వాత అతడి నుంచి ఐశ్వర్య రాజేష్ కు వేధింపులు మొదలయ్యాయి. ప్రేమించిన వాడు కావడంతో కొద్దిరోజులు ఐశ్వర్య రాజేష్ అతడి వేధింపులను భరించింది. ఆ తర్వాత అవి అంతకంతకూ పెరగడంతో తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసింది.. “లవ్ కంటే బ్రేకప్ అయినప్పుడే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధను భరించలేక నేను ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నాను.. గత అనుభవాల వల్ల ప్రేమ అంటేనే భయం వేస్తోందని” ఐశ్వర్యా రాజేష్ తన మనోగతాన్ని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఈ విషయాలను బయటపెట్టింది.
తెలుగు నాట బిగ్ బ్రేక్
తెలుగులో ఐశ్వర్య కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆమె కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. కౌసల్య కృష్ణమూర్తి సినిమా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్ గా గొప్ప సక్సెస్ అందుకోలేదు. అయితే ఇటీవల ఐశ్వర్య నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమాయకమైన గోదావరి అమ్మాయిగా ఐశ్వర్య నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో విక్టరీ వెంకటేష్ ను ఐశ్వర్య డామినేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని కొన్ని వేదికలపై ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. విక్టరీ వెంకటేష్ తో పోటీపడి నటించి ఐశ్వర్యా రాజేష్ మంచి మార్కులు సంపాదించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఐశ్వర్య కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తొలిసారిగా తెలుగులో ఆమెకు పెద్ద బ్రేక్ లభించడంతో కెరియర్ ఊపందుకుంది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో.. పలు ఇంటర్వ్యూలలో ఐశ్వర్య పాల్గొంటున్నది. అందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నది. ఇప్పుడవి సంచలనంగా మారాయి. తొలిసారిగా ఐశ్వర్య తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలను బయట పెట్టడంతో.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. మంచి అందమైన తెలుగు అమ్మాయిని మిస్ చేసుకున్న అతడు దురదృష్టవంతుడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకునే వ్యక్తితో ప్రేమలో పడి.. జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని సూచిస్తున్నారు.