Viral Video: నాన్ వెజ్ అంటే ప్రాణం పెట్టే వాళ్లు చాలా మందే ఉన్నారు. వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులకు. పుట్టుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చుబడినట్టు ఉంటుంది. వాస్తవానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మసాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. నాన్ వెజ్ లో చికెన్ అంటే అమితమైన ఇష్టం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు.
రుచికరంగా, కారంగా, నోరూరించే నాన్-వెజ్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పుకుండా ఉపయోగపడుతుంది. వైరల్ క్లిప్‌లో యూట్యూబ్‌లో తన సొంత వంట ఛానెల్ నడుపుతున్న ఒక మహిళ వివరించిన చికెన్ ఫ్రై రెసిపీ చూసిన తర్వాత నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొంతమంది నెటిజన్లు ఈ ఆలోచనను ఇష్టపడినప్పటికీ చాలామంది రెసిపీని చూసిన తర్వాత షాక్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని ఆ మహిళకు సలహా ఇస్తున్నారు.
ఆ మహిళ చికెన్‌ను డీప్ ఫ్రై చేయడానికి అనేక బ్లేడ్‌లను ఉపయోగిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అవును, ఈ వింత వంటకం ఇంటర్నెట్‌లో క్షణాల్లోనే వైరల్ అయింది. దాదాపు 2.5 లక్షల మంది దీనిని చూశారు. గ్రామానికి చెందిన హోమ్ చెఫ్, కంటెంట్ క్రియేటర్ ఐషు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @village_ishu_channelలో రెసిపీ వీడియోను షేర్ చేసి, దానికి “బ్లేడ్ చికెన్ ఫ్రై” అనే క్యాప్షన్ ఇచ్చారు.