https://oktelugu.com/

Aishwarya Rajesh – Rashmika : ‘పుష్ప’ సినిమాలో రష్మిక నటన నాకు నచ్చలేదు : ఐశ్వర్య రాజేష్

'పుష్ప సినిమాకి రష్మిక కంటే నేను బాగా సూట్ అవుతాను.ఆమెకి ఆ పాత్ర ఎందుకో న్యాచురాలిటీ కి దగ్గరగా లేనట్టు అనిపించింది. నాకైతే ఆ పాత్ర సరిపోతుంది. ఆమె కంటే అబ్దుతంగా నటించి ఉండేదాన్ని' అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 14, 2023 / 09:47 AM IST
    Follow us on

    Aishwarya Rajesh – Rashmika : కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టి, తెలుగు నుండి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక మండన. ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ ఒక్కసారిగా దూసుకొచ్చేసింది. ‘గీత గోవిందం’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడం తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

    ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ , పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది. అయితే రష్మిక కి సోషల్ మీడియా లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, అదే రేంజ్ లో నెగటివిటీ కూడా ఉంది. ఈమె చేసే కొన్ని కామెంట్స్ కారణంగా ఆ నెగటివిటీ ఏర్పడింది.

    అయితే సోషల్ మీడియా లో మొదటి నుండి వినిపించే కామెంట్ ఏమిటంటే రష్మిక ‘పుష్ప’ సినిమాకి సెట్ కాలేదని, చిత్తూరు స్లాంగ్ ని ఆమె సరిగా మాట్లాడలేకపోయిందని, ఆమెకి బదులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని హీరోయిన్ గా తీసుకొని ఉంటే ఇంకా అద్భుతంగా ఆ పాత్ర వచ్చి ఉండేదని రష్మిక ని ద్వేషించే వాళ్ళు కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇదే విషయాన్నీ ప్రముఖ హీరోయిన్ ‘ఐశ్వర్య రాజేష్’ కూడా చెప్పుకొచ్చింది.

    ఆమె మాట్లాడుతూ ‘పుష్ప సినిమాకి రష్మిక కంటే నేను బాగా సూట్ అవుతాను.ఆమెకి ఆ పాత్ర ఎందుకో న్యాచురాలిటీ కి దగ్గరగా లేనట్టు అనిపించింది. నాకైతే ఆ పాత్ర సరిపోతుంది. ఆమె కంటే అబ్దుతంగా నటించి ఉండేదాన్ని’ అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.