https://oktelugu.com/

Photo Story: ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? అందానికే అసూయ పుట్టించే ఈమె కోసం ఇద్దరు స్టార్ హీరోలు ప్రాణాలు తీసుకోబోయారు!

ఇద్దరు హీరోలు అయితే ఒక పార్టీ లో కొట్టుకున్నారు కూడా. ఆమె మరెవరో కాదు విశ్వ సుందరి ఐశ్యర్యా రాయ్. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ అందాల రాశి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 30, 2024 / 05:31 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?, ఈమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగం లో క్వీన్. సోషల్ మీడియా పెద్దగా ప్రాచుర్యం లేని రోజుల్లోనే ఈమె అందం గురించి దేశం మొత్తం మాట్లాడుకోవడం చూసారు. సాధారణంగా స్టార్ హీరోల వారసుల వెండితెర అరంగేట్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మోడలింగ్ రంగం లో తెచ్చుకున్న ఫేమ్ కారణంగా, ఈమె మొదటి సినిమా కోసం అప్పట్లో ఆడియన్స్ చాలా ఎదురు చూసారు. అలా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చిన ఈ చిన్నారి దేశ వ్యాప్తంగా ఉన్న కుర్రాళ్ళ మనసుల్ని దోచేసుకుంది. చేసుకుంటే ఇలాంటి అందగత్తెని మాత్రమే చేసుకోవాలి అని తపన పడేలా చేసిన అందాల తార ఈమె. సినీ రంగం లో ఈమె డేట్స్ కోసం హీరోలు క్యూ కట్టారు.

    ఇద్దరు హీరోలు అయితే ఒక పార్టీ లో కొట్టుకున్నారు కూడా. ఆమె మరెవరో కాదు విశ్వ సుందరి ఐశ్యర్యా రాయ్. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ అందాల రాశి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఈమె తమిళంలో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇదే చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ అనే పేరు తో విడుదలై మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకి ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వచ్చాయి. కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఈమె తమిళంలో సినిమాలు చేస్తూ ఉండేది. అలా సాగిన ఐశ్వర్య రాయ్ కెరీర్ లో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. ఈమె హీరోయిన్ గా ఎదుగుతున్న రోజుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది. సల్మాన్ ఖాన్ ఈమె కోసం అప్పట్లో ఏదైనా చేసేవాడు. ఒక రోజు ఐశ్వర్య రాయి పుట్టినరోజు వేడుకలను సల్మాన్ ఖాన్ ఘనంగా జరిపించాడు. ఈ వేడుకకు షారుఖ్ ఖాన్ కూడా ఒక అతిథిగా విచ్చేశాడు. ఆ పార్టీ లో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ తో తనకి ఉన్న చనువు కారణంగా ఆమెపై ఒక జోక్ వేసాడు.

    Aishwarya

    దీనికి ఆవేశంతో ఊగిపోయిన సల్మాన్ ఖాన్ ఆ పార్టీ లో షారుఖ్ ఖాన్ పై చెయ్యి చేసుకున్నాడు. అప్పట్లో ఈ ఘటన పెను దుమారమే రేపింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు సల్మాన్ ఖాన్ తో లవ్ బ్రేకప్ చేసుకోవడం, అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవడం అన్ని అలా చకచకా జరిగిపోయాయి. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరు విడిపోతున్నారు అంటూ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇది ఇలా ఉండగా ఐశ్వర్య రాయి ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.