Riddi Kumar : సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి కొందరు బ్యాగ్రౌండ్ ఉండాలని అంటారు. ఎవరైనా సపోర్టు చేస్తే సినిమాల్లో రాణిస్తామని అనుకుంటారు. కానీ ఇప్పటికే ఫుల్ సపోర్టు ఉన్న వారు సైతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇతే సమయంలో కొందరు తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమ నటనతో ఆకట్టుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇటీవల ఓ అమ్మాయి ప్రభాస్ సినిమాల్లో నటించే అవకాశం తెచ్చుకుంది. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో రాణించకపోయినా.. మరోసారి రెబల్ స్టార్ సినిమాల్లో నటించేందుకురెడీ అయింది. అయితే ఈ భామ నెట్టింట్లో చేసే సందడి మాములుగా లేదు. తన హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ?
ప్రభాస్ మూవీ రాధే శ్యాం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే నటించారు. కృష్ణం రాజు చివరి సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది రిద్దీ కుమార్. ఈమె ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా ద్వారా ఎంట్రీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ప్రభాస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో నటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే నటించిన కొన్ని సినిమాలే అయినా సినిమాల్లో ఈమె ప్రత్యేకంగా నిలుస్తుంది.
రిద్ది కుమార్ పూణె, బెంగుళూర్ వంటి ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత ఫిలాసఫీ లో డిగ్రీ పూర్తి చేశారు. అయితే చిన్నప్పటి నుంచే ఈమెకు నటనా రంగంలో ఆసక్తి . దీంతో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు ప్రాజెక్టుల్లో పాల్గొంది. 2014 సంవత్సరంలో ఆర్ ఎస్ ఐ క్వీన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీ మోడలింగ్ రంగ పోటీల్లో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్ని సీరియళ్లలోనూ నటించిన ఆమె చివరికి ఎలాగైనా సినిమాల్లో అవకాశం తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ నటించిన అనగనగా ఓ ప్రేమకథ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఎంతో మంది ఇతర ప్రాంతాలకు చెందిన హీరోయిన్లు తెలుగులో అవకాశాలు తెచ్చుకొని గుర్తింపు పొందారు.రిద్దీ కుమార్ సైతం తెలుగు పరిశ్రమ వైపే ఆసక్తి చూపారు. అయితే రిద్దీ కుమార్ కు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా తన నటనతో ఆకట్టుకుంది. ముందుగా రాజ్ తరుణ్ తో కలిసి నటించిన ఆమె రెండో సినిమా ఏకంగా ప్రభాస్ తో నటించింది. అయితే సినిమాల్లో రిద్దీ కుమార్ తక్కువగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. తన హాట్ హాట్ పొటోలతో కుర్రకారుకుమత్తెక్కిస్తోంది. రిద్దీ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలను చూస్తే గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనక్కి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఆమెకు త్వరలోనే సినిమా అవకాశాలు వస్తాయని కొనియాడుతున్నారు. అయితే ఈ భామ మరికొన్ని సినిమాలు నటించిన తరువాత స్టార్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
&