https://oktelugu.com/

Aishwarya Rai: ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఐశ్వర్యరాయ్.. విడాకులు నిజమేనా?

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై కొన్ని రోజులుగా విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. .. ఇలాంటి వార్తలపై సెలబ్రెటీలు స్పందిస్తుంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 16, 2023 / 04:03 PM IST

    Aishwarya Rai

    Follow us on

    Aishwarya Rai: ఎవరి అందాన్ని అయినా పొగడాలి అంటే ముందుగా చందమామ మొహం, లేదా ఐశ్వర్యరాయ్ లా ఉన్నావ్ అంటారు. అంతలా పేరు సంపాదించింది మిస్ వరల్డ్ ఐషు. ఈమె నటనతో ఎంతో మందిని మంత్రముగ్దులను చేసి అందరి మదిని దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బిగ్ బీ గా పేరు సంపాదించిన అమితాబ్ బచ్చన్ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ పాపకు కూడా ఉంది. కానీ ఎందుకో వీరు విడిపోతున్నారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

    ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై కొన్ని రోజులుగా విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. .. ఇలాంటి వార్తలపై సెలబ్రెటీలు స్పందిస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. వార్తల్లో నిజం లేకపోతే స్పందిస్తారు కదా.. అంటే నిజంగానే వీరు విడిపోతున్నారా అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు తాజాగా ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని వదిలి తన కూతురును తీసుకొని బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తోంది.

    ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుందట. తన కూతురు గొడవల వాతావరణంలో పెరిగితే డిస్టర్బ్ అవుతందనే ఉద్దేశ్యంతో ఇలా చేసిందట ఐషు. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కు కూడా ఐశ్వర్య రాయ్ తన ఇంటికి కోడలిగా రావడం ఇష్టం లేదట. అంతేకాదు తన కొడుకు మాజీ లవర్ కరిష్మా కపూర్ అంటేనే ఇప్పటికీ ఆమెకు ఇష్టమట. అంతేకాదు పార్టీల్లో కూడా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుందట. ఇదిలా ఉంటే జయా బచ్చన్ కు ఐశ్వర్యరాయ్ కు మధ్య ఎక్కువగా గొడవలు అవుతున్నాయట. వీరి మధ్య అభిషేక్ బచ్చన్ తల దూర్చడంతో దంపతుల మధ్య కూడా గొడవలు తలెత్తాయట.

    ఈ గొడవల వల్ల ఐశ్వర్యరాయ్ తన కూతురును తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.