https://oktelugu.com/

Abhishek Bachchan Aishwarya Rai: విడాకుల దిశగా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ జంట.. వాళ్ల అడుగులు ఎటు వైపు సాగుతున్నాయి…

ఇండస్ట్రీ లో చాలా మంది నటి నటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు...అయితే కొందరు కలకాలం కలిసుంటే మరి కొందరు మాత్రం మధ్యలోనే విడిపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 12:41 PM IST

    Abhishek Bachchan Aishwarya Rai

    Follow us on

    Abhishek Bachchan Aishwarya Rai: ఒకప్పుడు మిస్ ఇండియా గా గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించి నటిగా చాలా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఇక దాని ద్వారా ఐశ్వర్యరాయ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక బిగ్ బి ‘అమితా బచ్చన్ ‘ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన చేసిన సినిమాలు భారీ రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో కొన్ని సంవత్సరాలపాటు ఏలాడు… ఇక తన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ‘అభిషేక్ బచ్చన్’ మొదట్లో కొన్ని సినిమాలతో సక్సెస్ లను అందుకున్నప్పటికీ అమితాబ్ లాంటి స్టార్ ఇమేజ్ అయితే సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని తెలుసుకున్న అమితా బచ్చన్ కూడా వాళ్ళ ప్రేమకి అడ్డంకి చెప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాల నుంచి చాలా అన్యోన్యంగా ఉంటున్న వీళ్ళ జంట గత సంవత్సరం నుంచి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్భా అభిషేక బచ్చన్ 2024 పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ చూడడానికి పారిస్ వెళ్ళాడు. ఇక దాంతో ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. నిజానికి అభిషేక్ బచ్చన్ మాట్లాడిన దానికి ఒక ఫేక్ వీడియో ని క్రియేట్ చేసి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నట్టు తను ఆల్రెడీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టు ఒక వీడియోను అయితే క్రియేట్ చేశారు.

    ఇక దీని మీద స్పందించిన అభిషేక్ బచ్చన్ ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇలాంటి తప్పుడు వార్తలను రాస్తున్నారు అంటూ మీడియా పైన చాలా ఫైర్ అయ్యారు… ఇక ఇదిలా ఉంటే మొత్తానికైతే వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు అనే వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇంకా వీళ్లిద్దరు కలిసే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే తప్పుడు కథనాలు రాయడం పైన పలువురు సినీ మేధావులు సైతం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

    ఇక ఏది ఏమైనప్పటికి అన్యోన్య దంపతులుగా చాలా సంవత్సరాల పాటు వెలుగొందిన ఈ క్యూట్ కపుల్స్ కూడా ఇప్పుడు విడాకుల బాట పట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇంకా వీళ్ళు విడాకులు అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం డివోర్స్ తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అంబానీ కొడుకు పెళ్లిలో అభిషేక్ బచ్చన్ ఒక్కడే సింగిల్ గా కనిపించడం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి… చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది…