Two Wheeler Sales : 2024లో టూ వీలర్ అమ్మకాల్లో భారత్ జోష్ .. చైనాను అధిగమించే అవకాశం.. నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

కౌంటర్ పాయింట్ రీసెర్స్ తాజాగా ఓ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఏడాది ఫైనాన్స్ ఇయర్ పూర్తయ్యే వరకు టూవీలర్ అమ్మకాల్లో చైనాను అధిగమిస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో భారత్ జోష్ పెరిగింది. 2024 త్రైమాసిక వాహనాల విక్రయాల్లో 4 వీలర్ కంటే టూవీలర్ వాహనాలే ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి.

Written By: Srinivas, Updated On : August 12, 2024 12:54 pm

Two heeler sales

Follow us on

Two Wheeler Sales :  ఆటోమోబైల్ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. వినియోగదారులను ఆకర్షించే విధంగా కార్లు, బైక్ లు తీసుకొస్తున్నారు. లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన వాహనాలు మార్కెట్లోకి రావడం ఇంప్రెస్సింగ్ గా మారింది . అభివృద్ధి చెందిన దేశాల్లో రిలీజ్ చేసే వాహనాలను ఇప్పుడు భారత్ లోనూ లాంచ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని విదేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి తమ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రంగంలో భారత్ త్వరగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన నివేదికల ప్రకారం భారత్ లో టూ వీలర్ విక్రయాల సంఖ్య జోరుగా పెరిగింది. ఇది చైనా కంటే అధికంగా ఉండడం విశేషం. ఫోర్ వీలర్ కంటే టూ వీలర్ వాహనాల విక్రయం వేగంగా వృద్ధి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

కౌంటర్ పాయింట్ రీసెర్స్ తాజాగా ఓ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఏడాది ఫైనాన్స్ ఇయర్ పూర్తయ్యే వరకు టూవీలర్ అమ్మకాల్లో చైనాను అధిగమిస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో భారత్ జోష్ పెరిగింది. 2024 త్రైమాసిక వాహనాల విక్రయాల్లో 4 వీలర్ కంటే టూవీలర్ వాహనాలే ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కంటే 1.5 రేట్లు విక్రయశాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 2023 సంవత్సంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు అంతగా సాగలేదు. ఈ ఏడాదిలో 1 శాతం కంటే తక్కువగానే సేల్స్ అయ్యాయి. కానీ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన వాహనాలు మాత్రం 2024 ఏడాదిలో అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ నివేదికపై ఆటోమోబైల్ రంగానికి చెందిన సీనియర్ విశ్లేషకుడు సౌమెండ్ మండలి స్పందించారు. భారత్ లో 2025 తరువాత టూ వీలర్ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతందని అన్నారు. ముఖ్యంగా ఆగ్నేషియా దేశాలకు భారత్ నుంచి ఎక్కువగా ఈవీలు ఎగుమతి అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం టూ వీలర్ మార్కెట్ కు మంచి ఆదరణ ఉందన్నారు. ఇదిలా ఉండగా టాప్ టూ వీలర్ విక్రయాల్లో భారత్ కు చెందిన 3 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. వీటిలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ మూడు కంపెనీల మధ్య పోటీ ఏర్పడి కొత్త వాహనాలు ఆవిష్కృతమవుతున్నాయి.

గ్లోబల్ వ్యాప్తంగా 2030 నాటికి టూ వీలర్ అమ్మకాల్లో 44 శాతం ఈవీలే ఉండే అవకాశం ఉంటుంది. 2024 నుంచి 2030 వరకు 150 మిలియన్ యూనిట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్స్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఫోర్ వీలర్ వాహనాలతో సమానంగా టూ వీలర్ వాహనాలు వృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు ఆదరించేర అవకాశం ఉందన్నారు. మొబైల్ లో 4 జీ నుంచి 5 జీ కి ఎలా అప్డేట్ అవుతున్నారో.. ఇప్పుడున్న వాహనదారులు అప్డేట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తారని తెలిపారు.