Homeఎంటర్టైన్మెంట్Aindham Vedham OTT: ప్రతి వెయ్యేళ్లకు జరిగే అద్భుతం, మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్...

Aindham Vedham OTT: ప్రతి వెయ్యేళ్లకు జరిగే అద్భుతం, మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలో! డోంట్ మిస్

Aindham Vedham OTT: డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అంతకంతకు ఆదరణ పెంచుకుంటున్నాయి. ఇండియా వినోద పరిశ్రమ కు అతి పెద్ద మార్కెట్ గా ఉంది. ప్రతి ఏటా వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ ప్రధాన వినోద మార్గాలుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ తమ మార్కెట్ షేర్ పెంచుకుంటున్నాయి. అందుకు కారణం… ఆడియన్స్ కి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అన్ లిమిటెడ్ కంటెంట్ అందిస్తున్నాయి. వివిధ దేశాలు, భాషలకు చెందిన సినిమాలు, సిరీస్లు ఎంచక్కా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక వారాంతం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఓటీటీలకు ఆదరణ పెరిగాక థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. టికెట్స్ ధరలు విపరీతంగా పెరగడం కూడా ఇందుకు కారణం. ఒక సినిమాకు ఫ్యామిలీ ఖర్చు చేసే మొత్తంతో రెండు మూడు నెలల సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

తాజాగా ఓటీటీ లవర్స్ ని అలరించేందుకు ఓ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధం అవుతుంది. అదే ఐంధమ్ వేదమ్. హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశాడు. ఐంధమ్ వేదమ్ సిరీస్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ కి నాగ దర్శకత్వం వహించాడు. ఐంధమ్ వేదమ్ సిరీస్ 1000 ఏళ్లకు ఒకసారి విశ్వంలో చోటు చేసుకునే అద్భుత ఘటన ఆధారంగా రూపొందించారు. ఆ సమయంలో భూమి మీద జరిగే అద్భుతం ఏమిటనేది కథ.

ఐంధమ్ వేదమ్ ఆద్యంతం ఆసక్తికర ట్విస్ట్ లతో సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఐంధమ్ వేదమ్ సిరీస్ డిజిటల్ రైట్స్ జీ 5 సొంతం చేసుకుంది. అక్టోబర్ 25 నుండి స్ట్రీమ్ కానుంది. హీరోయిన్ ఓ పెట్టె తీసుకుని అయ్యంగార్ పురం అనే గ్రామం వెళుతుంది. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? గత జన్మలో హీరోయిన్ నేపథ్యం ఏమిటీ? అఘోరాలు దేని కోసం వెతుకుతున్నారు? అనేవి ఆసక్తికర అంశాలు. ఐంధమ్ వేదమ్ తప్పక చూసి ఎంజాయ్ చేయాల్సిన సిరీస్..

 

Aindham Vedham Trailer (Tamil) | A ZEE5 Original | Sai Dhanshika | Santosh| Naga| Premieres 25th Oct

Exit mobile version