https://oktelugu.com/

Best Cars Under 10 Lakh : దీపావళికి కొత్త కారుకొనాలని చూస్తున్నారా.. రూ.10లక్షల బడ్జెట్లో బెస్ట్ 5 మోడల్స్ ఇవే !

ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే మైక్రో & కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కార్లపై ఓ లుక్కేద్దాం.

Written By:
  • Mahi
  • , Updated On : October 21, 2024 11:07 am
    Best Cars Under 10 Lakh

    Best Cars Under 10 Lakh

    Follow us on

    Best Cars Under 10 Lakh : దేశవ్యాప్తంగా పండుగల సంబరాలు అంబరాన్నంటాయి. దీపావళి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు కొత్త కార్లు లేదా బైక్‌లను కూడా కొనుగోలు చేస్తారు. మీ బడ్జెట్ రూ. 10 లక్షలు అయితే ఆ డబ్బులతో మంచి ఫీచర్స్ ఉన్న కారును సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో హ్యుందాయ్ నుండి మారుతి-టాటా వరకు చాలా కంపెనీల మోడల్స్ ఉన్నాయి. వాటి లో టాప్ 5మోడల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే మైక్రో & కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కార్లపై ఓ లుక్కేద్దాం.

    1. Maruti Suzuki Fronx : భారతదేశంలో మంచి ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV కారు – ‘మారుతి సుజుకి ఫ్రాంక్స్’. ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో విడుదలైంది. లాంచ్ అయిన 10 నెలల్లోనే లక్ష యూనిట్ల విక్రయాలతో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ కార్లలో దాదాపు 2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా, ఈ కారు జపాన్‌తో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబుతోంది. ఈ కారు ధర సుమారుగా రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షలు (ఎక్స్‌-షోరూం) వరకు ఉంటుంది. కారు ఫీచర్స్. ఈ కారు 998 సీసీ నుంచి 1197 సీసీ ఇంజిన్‌ లలో వస్తుంది. ఈ కారు పవర్‌ – 76.43 bhp – 98.69 bhp వరకు ఉంటుంది. టార్క్‌ – 98.5 Nm – 147.6 Nmను విడుదల చేస్తుంది. ఈ కారులో ఐదుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. లీటరు పెట్రోలుకు 20.01 నుంచి 22.89 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

    2. Tata Punch : టాటా పంచ్ పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. పంచ్ iCNG అనేది ఐకానిక్ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ కు ప్రసిద్ధి చెందింది. ఈ కారుకు iCNG కిట్ అందించబడింది, ఇది వాహనాన్ని ఎలాంటి లీకేజీ నుండి కాపాడుతుంది. కారులో ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతున్నట్లయితే, ఈ టెక్నాలజీ సహాయంతో కారు ఆటోమేటిక్‌గా CNG మోడ్ నుండి పెట్రోల్ మోడ్‌కి మారుతుంది. టాటా పంచ్ భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడ్డాయి. దీనితో పాటు, వాయిస్-సహాయక సన్‌రూఫ్ కూడా వాహనంలో అమర్చబడింది. ఈ టాటా కారులో R16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7,22,900 నుండి రూ.10.20 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది. ఈ కారు ఇంజిన్‌ – 1199 సీసీతో వస్తుంది. ఈ కారు పవర్‌ 72 bhp – 87 bhp వరకు ఉంటుంది. టార్క్‌903 Nm – 115 Nmను విడుదల చేస్తుంది. ఈ కారులో ఐదుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. లీటరు పెట్రోలుకు 18.8 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

    3. Hyundai Exter CNG : హ్యుందాయ్ ఎక్సెటర్ సీఎన్జీ కూడా రూ. 10 లక్షల శ్రేణిలో నిలిచింది. ఈ కారులో పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. కారు వెనుక భాగంలో స్పోర్టి స్కిడ్ ప్లేట్ ఇవ్వబడింది. ఈ కారుకు వాయిస్ అసిస్టెడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించబడింది. వాహనంలో డ్యాష్‌క్యామ్‌తో పాటు డ్యూయల్ కెమెరాను అందించారు. హ్యుందాయ్ ఎక్సెటర్ బై-ఫ్యూయల్ సీఎన్జీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.60 లక్షల నుండి రూ.9.38 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది. ఈ కారు ఇంజిన్ 1197సీసీతో వస్తుంది. ఈ కారు పవర్‌ 67.72 bhpను , ఈ కారులో ఐదుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. లీటరు పెట్రోలుకు 27.1 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

    4. Hyundai Venue : భారతదేశంలోని టాప్‌-సెల్లింగ్ కార్లలో హ్యుందాయ్ వెన్యూ మోడల్ కారు కూడా ఒకటి. ఇది 1.2 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌లు మాన్యువల్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అను సందానంలో పనిచేస్తాయి. ఈ కాంపార్ట్ ఎస్‌యూవీలో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. మార్కెట్లో ఈ హ్యుందాయ్‌ వెన్యూ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది. ఈ కారు 998 సీసీ – 1493 సీసీ ఇంజిన్ తో వస్తుంది. పవర్‌ 82 bhp – 118 bhpవరకు ఉంటుంది. టార్క్‌ 113.8 Nm – 250 Nmను విడుదల చేస్తుంది. ఈ కారులో ఐదుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. లీటరు పెట్రోలుకు 24.2 కి.మీల మైలేజ్ ఇస్తుంది.

    5. Citroen C3 Aircross : ఈ సిట్రోయెన్ కారు రెండు వేర్వేరు సీటింగ్ లేఅవుట్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఈ మిడ్-సైజ్ SUV 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. అవి మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పని చేస్తాయి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.99 లక్షల నుంచి రూ.14.33 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది. ఈ కారు 1199 సీసీ ఇంజిన్ తో వస్తుంది. పవర్‌ 81 bhp – 108.62 bhpవరకు ఉంటుంది. టార్క్‌ 190 Nm – 205 Nmను విడుదల చేస్తుంది. ఈ కారులో ఐదుగురు ఫ్రీగా కూర్చోవచ్చు. లీటరు పెట్రోలుకు 17.6 – 18.5కి.మీల మైలేజ్ ఇస్తుంది.