https://oktelugu.com/

Ahimsa Collections: ‘అహింస’ మొదటి రోజు వసూళ్లు.. ఈ దెబ్బకి సురేష్ బాబు ఇక సినిమాలు ఆపేస్తాడు!

రీ ఎంట్రీ తర్వాత కాస్త తన స్టైల్ ని మార్చి దగ్గుపాటి రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' అనే చిత్రాన్ని చేసాడు. ఇది కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక సరికొత్త తేజాన్ని చూస్తామేమో అని ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 3, 2023 / 09:08 AM IST

    Ahimsa Collections

    Follow us on

    Ahimsa Collections: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డిఫరెంట్ టేకింగ్ తో సంచలనాత్మక దర్శకుడిగా నిలిచాడు తేజ. ఒకే రకమైన ప్రేమ కథలు మరియు కమర్షియల్ సినిమాలకు అడ్డుకట్ట వేసి ఒక కొత్త ఒరవడి సినిమాలకు నాంది పలికాడు. చిత్రం , జయం , నువ్వు నేను ఇలాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. అయితే తేజ ఇదే ఛత్రం లో ఇరుక్కుపోయాడు, అన్నీ సినిమాలను అదే తరహాలో తెరకెక్కించాడు, ఫలితంగా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కెరీర్ మొత్తం ఎండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది.

    మళ్ళీ రీ ఎంట్రీ తర్వాత కాస్త తన స్టైల్ ని మార్చి దగ్గుపాటి రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రాన్ని చేసాడు. ఇది కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక సరికొత్త తేజాన్ని చూస్తామేమో అని ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు. కానీ నిన్న ఆయన దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ తో తీసిన ‘అహింస’ అనే చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ ఆయన గాడి తప్పాడు ,తన పాత సినిమాల తరహాలోనే తీసి, ప్రేక్షకులను థియేటర్స్ లో హింసించాడు. మరి ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

    టీజర్ ట్రైలర్ తోనే ఇది రొటీన్ సినిమా అని జనాలకు అర్థం అయిపోయింది, దానికి తోడు తేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి ఏముంది ఈ సినిమాలో?, ఆపేయొచ్చు కదా ఎందుకు టైం వేస్ట్ అని అన్నట్టుగా చెప్పాడు, దీనితో సినిమాలో విషయం ఏమి లేదని అందరికీ అర్థం అయిపోయింది. అందుకే ఓపెనింగ్స్ అతి నీచం గా వచ్చాయి. చాలా ప్రాంతాలలో కనీసం థియేటర్ కరెంటు ఖర్చులకు కూడా అవసరమయ్యే గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టలేకపోవడం తో షోస్ ని మధ్యలోనే రద్దు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మొదటి రోజే అన్నీ ప్రాంతాలలో నెగటివ్ షేర్ వచ్చింది. అలా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు కనీసం 50 లక్షల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయిందట.

    దానికి షేర్ లెక్కగడితే 20 లక్షల రూపాయిలు కూడా రాదని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి సురేష్ బాబు కి అయిన ఖర్చు నాలుగు కోట్ల రూపాయిలు. అన్నీ ప్రాంతాలలో ఆయనే నేరుగా తన సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేసాడు. డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కూడా ఇంకా అమ్ముడుపోలేదు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి ఓటీటీ లో విడుదల చేసుకునే సురేష్ బాబు కి, ఇలాంటి మాస్టర్ స్ట్రోక్ తగిలిన తర్వాత ఇక సినిమాలను నిర్మిస్తాడా లేదా అని అంటున్నారు ట్రేడ్ పండితులు.