https://oktelugu.com/

Agent Collections : రెండవ రోజు థియేటర్ రెంట్స్ ని కూడా రాబట్టలేకపోయిన ‘ఏజెంట్’

ఏజెంట్ సినిమాకు రెండవ రోజు కనీసం 70 లక్షల షేర్ వసూళ్లు కూడా రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం 10 కోట్ల రూపాయిలు కూడా వచ్చేలా లేవని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2023 / 08:58 PM IST
    Follow us on

    Agent Collections : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో పాజిటివ్ టాక్ వస్తే పాత రోజుల్లో లాగా 50 రోజుల వరకు షేర్ వసూళ్లు వస్తున్నాయి.అదే డిజాస్టర్ టాక్ వస్తే కనీసం మొదటి రోజు కూడా నిలబడలేకపోతున్నాయి, అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇదే పరిస్థితి.

    అఖిల్ విషయం లో కూడా అదే జరిగింది, మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో మ్యాట్నీ షోస్ నుండి దారుణంగా వసూళ్లు పడిపోయాయి.ఇక రెండవ రోజు నుండి అయితే కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రధాన నగరాల్లో కూడా డెఫిసిట్స్ మీదనే నడిచిందని చెప్తున్నారు.

    ముఖ్యంగా హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ వంటి సెంటర్ లో సుదర్శన్ లాంటి థియేటర్ లో కూడా నేడు ఈ చిత్రానికి డెఫిసిట్ పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది. వారం రోజుల క్రితం విడుదలైన విరూపాక్ష చిత్రం ఈ సెంటర్ లో ఒక్కో షో కి లక్ష రూపాయిల చొప్పున వసూలు చేస్తే, ఏజెంట్ చిత్రం రోజు మొత్తానికి కలిపి లక్ష రూపాయిల లోపే గ్రాస్ ని రాబట్టడం ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురి చేసింది.

    కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అన్నిట్లో కూడా ఇదే పరిస్థితి.మొత్తం మీద ఈ చిత్రానికి రెండవ రోజు కనీసం 70 లక్షల షేర్ వసూళ్లు కూడా రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం 10 కోట్ల రూపాయిలు కూడా వచ్చేలా లేవని అంటున్నారు.