Allari Naresh : 4 రోజుల్లో 500 సిగరెట్లు..గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కనున్న అల్లరి నరేష్.?

రోజుకి వందకి పైగా సిగరెట్స్ తాగడం తో నా ఆరోగ్యం బాగా చెడిపోయింది, దగ్గు మరియు జ్వరం తో చాలా ఇబ్బంది పడ్డాను' అంటూ అల్లరి నరేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Written By: NARESH, Updated On : April 29, 2023 9:13 pm

allari naresh

Follow us on

Allari Naresh smoked : కెరీర్ ప్రారంభం నుండి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పర్చుకున్న హీరో అల్లరి నరేష్.అయితే ఈమధ్య ఆయన వరుసగా సీరియస్ సినిమాలు చేస్తూ కామెడీ కి బాగా దూరం అయ్యాడు.’నాంది’ అనే చిత్రం తో రూట్ మార్చి చాలా కాలం తర్వాత సూపర్ హిట్ ని అందుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత ‘మారేడుమల్లి నియోజకవర్గం’ అనే చిత్రం తో మరో సీరియస్ సబ్జెక్టు తో మన ముందుకి వచ్చాడు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, నరేష్ కి మంచి పేరు మాత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన ‘ఉగ్రం’ అనే చిత్రం తో మన ముందుకి రాబోతున్నాడు. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు, ఇప్పటికే టీజర్ మరియు ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.

నరేష్ లో ఇంత మాస్ యాంగిల్ ఉందా అని ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు.మే 5 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి ప్రొమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అడవి లో ఒక సన్నివేశం ఉంటుంది. అక్కడ స్మోక్ పెడుతారు, ఆ స్మోక్ మధ్యలో నుండి నేను స్టైల్ గా సిగరెట్ తాగుతూ నడుచుకుంటూ రావాలి,ఈ షాట్ చెయ్యడానికి నేను నాలుగు రోజులకు 500 సిగరెట్స్ తాగాను,రోజుకి వందకి పైగా సిగరెట్స్ తాగడం తో నా ఆరోగ్యం బాగా చెడిపోయింది, దగ్గు మరియు జ్వరం తో చాలా ఇబ్బంది పడ్డాను’ అంటూ అల్లరి నరేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు ప్రపంచం లో ఏ మనిషి కూడా తాగి ఉండరు, ఈ లెక్కన అల్లరి నరేష్ ట్రై చేస్తే గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కొచ్చు అని అంటున్నారు నెటిజెన్స్.